Nikhil On RRR Movie: ఆర్ఆర్ఆర్ ను కాదని ఇండియా నుంచి ఆస్కార్‌కు అఫీషియల్ గా “ఛెల్లో షో” మూవీ ఎంట్రీ ఇచ్చింది. దీనిపై మూవీ లవర్స్ అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాను కాదని.. అప్పటి వరకూ పేరు కూడా వినబడని సినిమాను పంపడంపై తెలుగు సినీ పరిశ్రమ, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో అయితే…పెద్ద యుద్ధమే జరుగుతోంది. రాంగ్ రూట్లో ఛెల్లో షోని ఆస్కార్కు పంపారనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలోని పెద్దలు కూడా దీనిపై ఘాటుగానే స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో నిఖిల్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఓ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అంశంపై నిఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. “ఇలా అంటున్నందుకు సారీ. ఈ విషయంలో నా అభిప్రాయం వేరు.
అందరికీ ఆస్కార్ అవార్డ్స్ అంటే ఇష్టమే. కానీ… మన సినిమాను ప్రపంచమంతా ఆదరించింది. అభిమానించింది. అదే సినిమాకు అతి పెద్ద అవార్డ్” అంటూ చెప్పుకొచ్చాడు.
“ఆర్ఆర్ఆర్ పై సినీ లవర్స్ ప్రేమ కురిపించారు. అదే ఆ సినిమా సాధించిన పెద్ద విజయం. అలాంటప్పుడు మనకు ఆస్కార్స్ ఎందుకు?
నేను పర్సనల్‌గా ఆస్కార్స్‌కు అంత ప్రాధాన్యతనివ్వను. అసలు ఆస్కార్స్ నుంచి మనకు సర్టిఫికేట్ అవసరమా? మన సినిమాలే ఒక అద్భుతం. అంటూ అన ఒపీనియన్ చెప్పాడు. నేను స్పెయిన్‌లో ఉన్నప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ చూశాను. థియేటర్ ఫుల్ అయిపోయింది. స్పానిష్ వాళ్లంతా ఆ సినిమాను చూసి తెగ ఇంప్రెస్ అయ్యారు. ఇంతకన్నా మించిన అవార్డ్ ఏముంటుంది అంటున్నారు ఈ కార్తికేయ హీరో.
ఇదీ చదవండి: Last Film Show Oscar Entry: “ఆర్ఆర్ఆర్” కు భారీ షాక్… “ఆస్కార్” రేసులో గుజరాతీ “లాస్ట్ ఫిల్మ్ షో”