Site icon Prime9

Hero Nani : ఆ షోకి పిలిచిన రాను అంటున్న హీరో నాని …

hero-nani-viral-comments-on-coffee-with-karan-show

hero-nani-viral-comments-on-coffee-with-karan-show

Hero Nani : న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. దసరా సినిమాతో భారీ విజయం సాధించిన నాని త్వరలో హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అయితే ఇటీవల సినిమాలకు సంబంధిన కొన్ని అంశాలపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో కూడా నిలుస్తున్నాడు. తాజాగా ఓ నేషనల్ మీడియా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నాని బాలీవుడ్ కరణ్ జోహార్ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశంలో బాలీవుడ్ టాప్ టాక్ షో కాఫీ విత్ కరణ్ షోకి పిలిస్తే వెళ్తారా అని అడగ్గా.. నాని దీనికి సమాధానమిస్తూ.. కాఫీ విత్ కరణ్ షోకి పిలిచినా రాను అని గౌరవంగా చెప్పేస్తాను. కరణ్ జోహార్ ని కలిసి, సినిమాల గురించి కాసేపు మాట్లాడమంటే ఓకే కానీ ఆ షోకి మాత్రం వెళ్ళను. నాలాంటి వాళ్లకి ఆ షో సెట్ అవ్వదు అని అన్నాడు. దీంతో నాని(Hero Nani) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

బాలీవుడ్ లో హిట్ టాక్ షో అయిన కాఫీ విత్ కరణ్ పాపులర్ అయినా గాని, దీనిపై చాలా మందికి నెగిటివ్ అభిప్రాయమే ఉంది. ఎక్కువ బోల్డ్ కంటెంట్, పర్సనల్ ప్రశ్నలు అడుగుతూ ఇంటర్వ్యూకి వచ్చిన వారిని కరణ్ ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో కరణ్ షోపై బయట కూడా కొంతమందిలో వ్యతిరేకత ఉంది. ఇలాంటి వాటి వల్లే నాని కూడా ఈ షోకి పిలిచినా వెళ్ళను అని చెప్పాడని అంతా భావిస్తున్నారు.

ఇక హాయ్ నాన్న మూవీ విషయానికి వస్తే మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది . ఈ మూవీ ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ స్టోరీ. సినిమాలో నాని భార్య చనిపోవడంతో పాపతో నాని జీవిస్తుంటాడని.. కాగా పాప ద్వారానే మృణాల్ నాని లైఫ్ లోకి వస్తుంది అని అర్ధమవుతుంది. గతంలోనూ జెర్సీ సినిమా ద్వారా నాన్న ఎమోషన్ తో నాని ఆల్రెడీ ప్రేక్షకులని ఎంతగానో మెప్పించాడు. ఒక్కో సీన్ లో అయితే థియోటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకులయితే కంటతడి పెట్టేశారనుకోండి. ఇప్పుడు మళ్ళీ హాయ్ నాన్న అంటూ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు నాని. ఇక ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Exit mobile version