Site icon Prime9

Nani : అల్లు అర్జున్ నేషనల్ అవార్డు పై నాని మరోసారి వైరల్ కామెంట్స్ ….

hero nani comments on allu arjun national award

hero nani comments on allu arjun national award

Nani : నేచురల్ స్టార్ నాని..  హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే దసరా సినిమాతో హిట్ అందుకున్న నాని ఇప్పుడు హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు . అయితే ఈ ఏడాది నేషనల్ అవార్డులు ప్రకటించిన సమయంలో చేసిన ఒక పోస్ట్ టాలీవుడ్ హాట్ టాపిక్ అయ్యింది. ఈ పోస్టు విషయంలో నాని టాలీవుడ్ అభిమానులు నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.ఈ విషయం పై నాని మరోసారి వైరల్ కామెంట్స్ చేశారు.

నాని ఆ పోస్ట్ లో ” తెలుగు ఇండస్ట్రీకి ఒక తీరని కలలా ఉన్న బెస్ట్ యాక్టర్ అవార్డుని అల్లు అర్జున్ అందుకొని తెలుగు వారికీ గౌరవం తీసుకువచ్చినందుకు అందరూ అభినందించారు. అలాంటి సంతోష సమయంలో నాని.. తమిళ్ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’కి అవార్డు ఇవ్వలేదని “బాధ వ్యక్తం చేశారు . ఒక మీడియా సమ్మిట్ లో పాల్గొన్న నానిని.. ఈ కాంట్రవర్సీ గురించి ప్రశ్నించారు. తెలుగు సినిమాలకు బదులు తమిళ సినిమాలకు అనుకూలంగా నాని పోస్ట్ పెట్టడమే అందుకు కారణం. ఆ పోస్ట్ వెనుక ఉన్న కారణం ఏంటని ప్రశ్నించారు దీనిపై నాని ఇలా క్లారిటీ ఇచ్చాడు.

‘నేను చేసిన పోస్ట్‌ను వేరే విధంగా చిత్రీకరించారు. తెలుగు సినిమాల విజయంతో సంతోషంగా ఉన్నాను. జాతీయ అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్, పుష్ప సినిమా అలాగే RRR టీమ్‌ని నేను అభినందించాను. నేను చూసిన సినిమాల్లో బెస్ట్ మూవీస్ లో జై భీమ్ ఒకటి. ఆ సినిమా చూసి ట్వీట్ చేశాను. జాతీయ అవార్డుల్లో ఏ విభాగంలోనూ ఆ సినిమాకు ఒక్క అవార్డు కూడా రానప్పుడు జ్యూరీ ఆ సినిమా చూశారా లేదా అనే ప్రశ్న తలెత్తిందని నాని అన్నారు . అలాగే “నా తెలుగు సినిమాకి ఈ ఏడాది అధికంగా నేషనల్ అవార్డులు వచ్చినందుకు నేను చాలా సంతోష పడ్డాను. అలాగే నా( Nani )బ్రదర్ అల్లు అర్జున్ టాలీవుడ్ కి మొదటి నేషనల్ అవార్డు తీసుకు రావడం పట్ల కూడా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను. అయితే జై భీమ్ సినిమాకి కూడా ఏదో ఒక క్యాటగిరిలో అవార్డు వస్తే బాగుండు అని ఫీల్ అయ్యాను.

మీకు అర్ధమయ్యేలా చెప్పాలంటే.. నా సిస్టర్ మంచి ర్యాంక్ తో పాస్ అయ్యింది. కానీ నా కజిన్ మంచి ర్యాంక్ సంపాదించలేకపోయాడు. అప్పుడు నేను నా సిస్టర్ కోసం ఆనంద పడతాను. అలాగే నా కజిన్ కోసం బాధని ఫీల్ అవుతాను. అలా ఫీల్ అయ్యే నేను పోస్టు వేశాను. కానీ దానిని మీడియా వాళ్లంతా వేరుగా రాసేశారు. నేషనల్ అవార్డుల పై నాని అసహనం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ కి రావడం ఇష్టం లేదు అన్నట్లు చూపించారు” అంటూ చెప్పుకొచ్చాడు.

Exit mobile version