Site icon Prime9

Ahimsa Teaser: రాణా తమ్ముడు హీరోగా కుమ్మేశాడు.. అహింస టీజర్ రిలీజ్

ahimsa teaser out

ahimsa teaser out

Ahimsa Teaser: టాలీవుడ్ లో దిగ్గజ నిర్మాత అయిన రామానాయుడు మనవడు, సురేశ్ బాబు రెండో త‌న‌యుడు, రాణా తమ్ముడు అయిన దగ్గుబాటి అభిరామ్ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘అహింస’. ఈ మూవీకి తేజ ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా తాజాగా ఈ మూవీ నుంచి టీజ‌ర్‌ను లాంఛ్ చేశారు మూవీ మేక‌ర్స్. ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో అభిరాం జంటగా గీతికా న‌టిస్తోంది.

ఒక ఇంగ్లీష్ (ముద్దు) ఇవ్వు, పోనీ తెలుగు ఇవ్వు అంటూ హీరోయిన్ అడుగుతుంటే నేనివ్వ‌ను, నిన్ను అస్స‌లు ఇవ్వ‌నివ్వ‌ను అని హీరో అంటున్న సన్నివేశంతో టీజర్ ప్రారంభం అవుతుంది. హీరోహీరోయిన్ల మ‌ధ్య సాగే లవ్ ట్రాక్‌తో మొద‌లైన ఈ టీజ‌ర్‌ ఫ్యామిలీ ఎమోష‌న్స్, యాక్ష‌న్ పార్టుతో సాగుతూ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. కాగా ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై పీ కిర‌ణ్ రూపొందిస్తుండగా ఆర్పీ పట్నాక్ సంగీతాన్ని సమకూర్చారు. ఇదిలా ఉండగా ఇప్ప‌టికే విడుద‌లైన అభిరామ్ స్ట‌న్నింగ్ లుక్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది. జ‌యం సినిమాతో డైరెక్టర్ తేజ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసిన హీరోయిన్ స‌దా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా స‌ముద్ర‌ఖ‌ని మెయిన్ విల‌న్‌గా ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.

ఇదీ చదవండి: ధనుష్, ఐశ్వర్య విడాకులు కాన్సిల్.. రజినీ ఇంట సంబరాలు..!

Exit mobile version