Site icon Prime9

Tollywood: లైగర్ సినిమా దెబ్బ పూరీ జగన్నాధ్ అబ్బా

puri jaganadh prime9news

puri jaganadh prime9news

Tollywood: లైగర్ సినిమాను భారీ అంచనాల నడుమ విడుదల చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ సినిమా వల్ల ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో తెలుసు కుందాం. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడానికి ఒక విధంగా విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ కారణమని గుస గుసలు విపిస్తున్నాయి అంతే కాకుండా కరణ్ జోహార్ కూడా కారణమని   టాలీవుడ్ పెద్దల నోటి నుంచి వస్తున్న మాట.

సినిమా ప్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లతో పాటు సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు ఎక్కడా లేని కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ముంబైలో ఒక 3BHK ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. లైగర్ సినిమా లాభాలు తెచ్చి పెట్టకుండా నష్టాలు రావడంతో ఇప్పుడు 3BHK ఫ్లాట్ ను ఖాళీ చేస్తున్నారని తెలిసిన సమాచారం. ఈ ఫ్లాట్ అద్దె , మెయింటెనెన్స్ మొత్తం కలిపి నెలకు రూ.15 లక్షలు అవుతుందని ఇప్పుడు అంత డబ్బు కట్టలేని పరిస్థితిలో ఉన్నారని అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంకో వైపు బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ పూరీని డబ్బు తిరిగి ఇచ్చేయలని  పూరీని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version