#BiggBossTelugu: రియాల్టీ షో ప్రారంభ సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, సీజన్ 2కి హీరో నాని చేసారు.అయితే, అక్కినేని నాగార్జున మూడవ సీజన్‌లోకి ప్రవేశించి కొనసాగుతున్నారు. అఅతను షో నుండి రెండుసార్లు విరామం తీసుకున్నప్పటికీ, ఒకసారి సమంతకు మరియు తరువాత రమ్యకృష్ణకి హోస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు.
టెలివిజన్‌లో ఈ రియాలిటీ షో యొక్క సీజన్ 6 హోస్ట్ చేయడానికి నాగార్జున పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 4 నుండి ప్రసారమయ్యే ఈ షోని హోస్ట్ చేయడానికి అతను రూ.15 కోట్లను తీసుకుంటున్నట్లు సమాచారం.అంతకుముందు సంవత్సరం, నాగార్జున అందులో సగం మాత్రమే తీసుకున్నారని భోగట్టా.అయితే తాజాగా పెరిగిన క్రేజ్ , డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని నాగార్జున ఈ మొత్తాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ తమిళం, మలయాళం మరియు కన్నడ వెర్షన్‌లను హోస్ట్ చేస్తున్న కమల్ హాసన్, మోహన్ లాల్ మరియు సుదీప్ వంటి వారు కూడా నాగ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ లో సగం కూడా వసూలు చేయడం లేదు. ఈ సంవత్సరం బిగ్ బాస్ హిందీ వెర్షన్‌ను హోస్ట్ చేయడానికి సల్మాన్ ఖాన్ దాదాపు రూ350 కోట్లు వసూలు చేస్తున్నాడని టాక్.