Site icon Prime9

FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ చూసిన అనన్యపాండే-ఆదిత్య రాయ్ కపూర్

FIFA

FIFA

FIFA: బాలీవుడ్ ప్రేమజంట అనన్య పాండే మరియు ఆదిత్య రాయ్ కపూర్ డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరు ఈ విషయాన్ని ఇప్పటివరకూ బహిరంగంగా వెల్లడించలేదు. తాజాగా ఈ జంట ఫిఫాప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ కోసం ఖతార్‌కు వెళ్లారు. అనన్య మరియు ఆమె కుటుంబం ప్రపంచ కప్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి వెళ్లగా వారితో ఆదిత్య కూడా కలిసాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలలో, ఆదిత్య రాయ్ కపూర్ అనన్య పాండే, ఆమె తండ్రి చుంకీ పాండే, నటుడు సంజయ్ కపూర్ మరియు అతని కుమార్తె షానాయ కపూర్‌లతో కలిసి పోజులిచ్చాడు. మరో వీడియోలో, ఆదిత్య మరియు అనన్య ఒక వేదిక వద్ద ఇతరులతో కలిసి నడుస్తూ కనిపించారు. అనన్య, ఆమె కుటుంబం, షానయ మరియు ఆమె కుటుంబం, ఆదిత్య కలిసి కూర్చుని, అర్జెంటీనా మరియు క్రొయేషియా మధ్య జరిగిన ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను చూసారు

అనన్య రాబోయే చిత్రం డ్రీమ్ గర్ల్ 2 లో ఆయుష్మాన్ ఖురానా సరసన కనిపించనుంది. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా ఇది విడుదలకానుంది.ఆమె సిద్ధాంత్ చతుర్వేది మరియు ఆదర్శ్ గౌరవ్ సరసన ఖో గయే హమ్ కహాన్‌లో కూడా కనిపించనుంది. ఆదిత్య తాడం రీమేక్‌లో నటిస్తున్నాడు. అతను అనురాగ్ బసు యొక్క మెట్రో ఇన్ డినోలో సారా అలీ ఖాన్ సరసన కూడా నటిస్తున్నాడు.

Exit mobile version