Site icon Prime9

Game Changer : రామ్ చరణ్ ఫ్యాన్స్ కి నిరాశ.. అనుకున్నదే అయ్యిందిగా..!

game changer movie song post pond officially

game changer movie song post pond officially

Game Changer : హీరో రామ్ చరణ్ , డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా కోసం చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ అనేక కారణాలు వల్ల లేట్ అవుతూ వస్తుంది. సినిమా షూటింగ్ మొదలయ్యి రెండేళ్లు గడిచి పోయింది. కానీ మూవీ మాత్రం ఇంకా చిత్రీకరణ పూర్తి చేసుకోలేదు. సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు.

ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తోంది. శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జే.సూర్య, సునీల్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు దీన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి ఒక పోస్టర్, టైటిల్ తప్ప మరే అప్డేట్ లేదు. మధ్య మధ్యలో అత్యుత్సాహంతో వచ్చిన కొన్ని లీక్స్ తప్పితే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడం, చిత్రయూనిట్ కూడా సరిగ్గా స్పందించకపోవడంతో అభిమానులు తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. అభిమానులు చిత్రయూనిట్ ని సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేస్తున్నారు.

ఇక ఇటీవల ఈ మూవీ నుంచి ‘జరగండి..’అనే ఓ సాంగ్ లీక్ అయ్యింది అనే విషయం తెగ వైరల్ అయింది. చిత్రయూనిట్ సాంగ్ లీక్ చేసిన వారిపై కేసు పెట్టి అరెస్ట్ కూడా చేయించింది. దానిని అఫీషియల్ గా దీపావళికి రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించింది . ఈ మూవీ కి సంభందించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మళ్ళీ అప్పట్నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. గత కొన్ని రోజులుగా ‘జరగండి..’ సాంగ్ రిలీజ్ పోస్టుపోన్ అవుతుందని సోషల్ మీడియా లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి .తాజాగా అదే నిజమైంది. చిత్ర యూనిట్ అధికారికంగా.. జరగండి సాంగ్ దీపావళికి రిలీజ్ చెయ్యట్లేదు అని, ఆడియో డాక్యుమెంటేషన్ ఇష్యూస్ వచ్చాయని, ప్రస్తుతానికి వాయిదా వేసి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని తెలుపుతూ ఓ లెటర్ రిలీజ్ చేశారు.

 

అలాగే గేమ్ ఛేంజర్ సినిమా అభిమానులని మెప్పిస్తుందని, సినిమా కోసం చాలా మంది వర్క్ చేస్తున్నారని, మీకు బెస్ట్ ఇస్తామని తెలిపింది. దీంతో మరోసారి చరణ్ అభిమానులు నిరాశ చెందుతూ చిత్రయూనిట్ ని తిడుతున్నారు. మరి గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఈ సాంగ్ ఎప్పుడు వస్తుందో, అప్డేట్ ఎప్పుడు వస్తుందో, అసలు సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

Exit mobile version