Site icon Prime9

Game Changer: నెల రోజుల ముందే ఓటీటీలోకి ‘గేమ్‌ ఛేంజర్‌’ – ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!

Game Changer OTT Release Date: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. తాజాగా అమెజాన్‌ ప్రైం మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్, కియార అద్వానీ హీరోహీరోయిన్లుగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్ తర్వాత రామ్‌ చరణ్‌ నటించిన చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్నో అంచాల మధ్య ఈ సంక్రాంతికి థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేకోపోయింది.

ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా వచ్చిన చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌తో ఇండస్ట్రీ హిట్‌ కొడతాడని అభిమానులంత ఆశ పడ్డారు. ప్రీమియర్స్‌తోనే మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి రోజు రూ. 80 కోట్ల గ్రాస్‌ మాత్రమే రాబట్టింది. సైలెంట్‌ థియేటర్ల వచ్చేసిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ని అమెజాన్‌ ప్రైం సొంతం చేసుకుంది. మూవీ రిలీజై నెల రోజులు కావోతోంది. ఒప్పందం ప్రకారం గేమ్‌ ఛేంజర్‌ స్ట్రీమింగ్‌కి ఇచ్చేందుకు అమెజాన్‌ ప్రైం రెడీ అయ్యింది. ఫిబ్రవరి 7 నుంచి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో గేమ్‌ ఛేంజర్‌ అమెజాన్‌లో స్ట్రీమింగ్‌కి రాబోతోంది.

Exit mobile version