Site icon Prime9

Hai Nanna : నాని, మృణాల్ ఠాకూర్ “హాయ్ నాన్న” నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్..

first lyrical song released from nani, mrunal thakur starring hai nanna movie

first lyrical song released from nani, mrunal thakur starring hai nanna movie

Hai Nanna : నాచురల్ స్టార్ నాని.. ఈసారి గేర్ మార్చారు. ఇటీవలే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కీర్తి సురేష్ జంటగా ఆయన నటించిన ‘దసరా’ సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకుంది. ఈ చిత్రంలో  తన రా అండ్ రస్టిక్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసిన నాని.. ఈసారి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో రాబోతున్నాడు. నూతన దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్ లో నాని తన 30వ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. “హాయ్ నాన్న” అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రంలో (Hai Nanna) నాని సరసన “సీతారామం” బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రంలో నాని ఓ పాపకి తండ్రిగా నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో తండ్రికూతుళ్ల ఎమోషన్స్ హైలైట్ కానున్నాయని ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్ చూస్తే అర్దం అవుతుంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21, 2023 న ఈ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో (Hai Nanna) తొలి లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు నాని. ఈ క్రమంలోనే తాజాగా “సమయమా…” అంటూ సాగే సాంగ్ లిరికాల వీడియోని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్‌ లో నాని, మృణాల్.. పెయిర్ చూడడానికి మాత్రం భలే ఉన్నారు. తెరపై వారి కెమిస్ట్రీ ఎంత వరకు వర్కవుట్ అయ్యిందో చూడాలి. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా.. అనురాగ్ కులకర్ణి, సితార కృష్ణ కుమార్ ఆలపించారు. రీసెంట్ గానే “ఖుషి” మూవీతో అబ్దుల్ వహాబ్ మంచి మ్యూజికల్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీతో తన జోష్ ని కొనసాగించాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

 

 

Exit mobile version