Site icon Prime9

Varasudu: “వారసుడు” నుంచి తాజా అప్డేట్.. ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేస్తుంది

varasudu movie review

varasudu movie review

Varasudu: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారసుడు’. ఈ సినిమా ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రం నుంచి తాజా అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను ఈ రోజు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న వారసుడు చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా నుండి ఇప్పటివరకు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే వచ్చింది. కాగా దానిని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. దానితో ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తుండగా, తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమోను గురువారం సాయంత్రం 6.30 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. దిల్ రాజు నిర్మాతగా భారీ బడ్జెట్ తో పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది, కాగా ఈ మూవీలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇదీ చదవండి: ఆకట్టుకుంటున్న హిట్-2 ట్రైలర్.. అంచనాలు పెంచేస్తున్న కేడీ

Exit mobile version