Singer Vani Jairam Demise: ప్రముఖ గాయని వాణీ జయరాం మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో కొట్టినట్టు వాణీ జయరాం నుదురు, ముఖం పై గాయాలున్నాయి.
దీంతో చెన్నైలోని ట్రిబుల్ కేన్ పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మొదట అపస్మారక స్థితి పడి చనిపోయారని అంతా అనుకున్నారు.
కానీ పనిమనిషి చెప్పిన విషయాలు, వాణీ జయరాం ముఖంపై గాయాలను చూస్తేంటే మృతిపై అనుమానాలు రేకెత్తాయి.
దీంతో పోలీసులు కూడా అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి.. ఆ దిశగా విచారణ చేపట్టారు.
అసలేం జరిగిందంటే.. (Singer Vani Jairam Demise)
చెన్నై నుంగంబాకం ప్రాంతంలో వాణీ జయరాం నివాసం ఉంటున్నారు. రోజూ మాదిరి లానే శనివారం ఉదయం కూడా పనిమనిషి వాణి జయరాం ప్లాట్ కు వచ్చింది.
ఇంట్లోకి వెళ్లేందుకు కాలింగ్ బెల్ నొక్కినా తలుపు తీయలేదు. ఇంకొన్ని సార్లు ప్రయత్నించినా లాభం లేకపోవడంతో కంగారు పడిన పనిమనిషి వాణీ జయరాం బంధువులకు సమాచారం ఇచ్చింది.
బందువులు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వచ్చి డోర్ ను పగల కొట్టి చూడగా వాణీ జయరాం విగతజీవిగా పడి ఉన్నారు.
ముఖంపై తీవ్ర గాయాలను గుర్తించారు పోలీసులు. వెంటనే ఆసుపత్రికి తరలించగా..అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పనిమనిషిని అడిగి అదనపు సమాచారం సేకరిస్తున్నారు.
వాణీ జయరాం ప్లాట్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని సీసీ టీవి ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పోరెన్సిక్ నిపుణులు ఆధారాలను సేకరిస్తున్నారు.
ఒమేదురార్ ప్రభుత్వాస్పత్రిలో వాణీ జయరాం పార్థివదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
కాగా, 2018 లో వాణీ జయరాం భర్త చనిపోయారు. వారికి పిల్లలు లేకపోవడంతో వాణీ జయరాం ఒక్కరే ఒంటరిగా ఉంటున్నారు.
పనిమనిషి రోజూ వచ్చి ఆమె సాయంగా ఉంటోంది. పని పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్లిపోయేది.
(భర్తతో వాణీ జయరాం)
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/