Site icon Prime9

New Movie Posters: దీపావళి వేళ సందడి చేస్తున్న కొత్త సినిమా పోస్టర్లు..!

new movies posters

new movies posters

New Movie Posters: దీపావళి పండుగ రోజున సినీ అభిమానులకు తమ తాజా చిత్ర అప్డేట్స్ ఇస్తున్నారు టాలీవుడ్ హీరోలు. తమ సినిమాలకి సంబంధించిన పోస్టర్లను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ సందడి చేస్తున్నారు. దానితో తమతమ ఫేవరెట్ హీరోల సినిమా అప్ డేట్స్ తో నెట్టింట సందడి వాతావరణం కనపరుస్తున్నారు అభిమానులు. కొంత వరకు షూటింగు జరుపుకున్న సినిమాలు టీజర్లు, ట్రైలర్లు వదులుతూ ఉంటే, మరికొన్ని సినిమాల నుంచి కొత్త పోస్టర్లను రిలీజ్ అవుతున్నాయి. ఈ కోవకు చెందినవే ఇప్పుడు చెప్పే సినిమాలు

టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరు సమంత. కాగా ఈ ముద్దుగుమ్మ ప్రధానమైన పాత్రను పోషించిన తాజా చిత్రం ‘యశోద’. నవంబర్ 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందు సందడి చేయనుంది. కాగా దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ ను
విడుదల చేశారు చిత్ర బృందం.

ఇకపోతే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ తెలుగు, తమిళం భాషల్లో సినిమా చేస్తున్న విషయం విదితమే. కాగా ఈ చిత్రం ‘సార్’ టైటిల్ తో ప్రేక్షకులను పలకరించనుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి దివాళీ సందర్భంగా కొత్త పోస్టర్ ను వదిలారు. తమిళంలో ఈ సినిమాకి ‘వాతి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు చిత్ర బృందం. సితార బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లోపాలపై ఆలోచింపజేసే కథతో తెరకెక్కనుంది ఈ సినిమా.

ఇదిలా ఉండగా మరో తమిళ స్టార్ హీరో విజయ్ కూడా తెలుగు తమిళ భాషల్లో ఒక సినిమా చేస్తున్నాడు. తెలుగులో ‘వారసుడు’, తమిళంలో ‘వరిసు’ అనే టైటిల్ తో ఈ మూవీ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ సినిమా నుంచి కూడా ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను షేర్ చేశారు.

మరి మన మాస్ మహరాజ రవితేజ ‘రావణాసుర’ నుంచి కూడా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇలా ఈ దీపావళి సరికొత్త సినిమా అప్ డేట్స్ మరింత ఆనందంగా మారింది.

ఇదీ చదవండి: రచ్చలేపుతున్న మెగా 154 టైటిల్ టీజర్.. పక్కా మాస్ లుక్ లో మెగాస్టార్

Exit mobile version