Site icon Prime9

Mangalavaaram : పాయల్ “మంగళవారం” మూవీకి మెగా ఫ్యామిలీ సపోర్ట్ అందుకేనా..?

interesting deatils about mega family support for mangalavaram movie

interesting deatils about mega family support for mangalavaram movie

Mangalavaaram : ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత నటి పాయల్ – దర్శకుడు అజయ్ భూపతి కలిసి చేస్తున్న చిత్రం “మంగళవారం”. మొదటి సినిమాలో థ్రిల్లింగ్ లవ్ స్టోరీతో వచ్చిన వీరిద్దరి.. ఇప్పుడు హీరోయిన్ పాత్ర చుట్టూ తిరిగే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. కాగా ఈ సినిమాని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ.ఎం నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ అండ్ ట్రైలర్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. సినిమా పై మంచి బజ్‌ని, క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఇక లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ ఉత్కంఠ రేపే విధంగా సాగింది.

ఇక రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ విషయానికి వస్తే.. పాయల్ రాజ్ పుత్ హాట్ సీన్, షాకింగ్ ట్విస్ట్ లు, అదిరిపోయే బిజీఎం, ఆకట్టుకుంటుకున్న విజువల్స్ తో ఎమోషన్స్ సీన్స్ కూడా చూపించారు. ఇక సినిమాలో ఇంతకీ ఆ మాస్క్ ధరించేది ఎవరు.. వంటి సస్పెన్స్ అంశాలు ఇంటరెస్టింగ్ గా మారాయి.

Payal Rajput goes backless in 'Mangalavaram' poster - News - IndiaGlitz.com

ఇక ఈ సినిమాకి మరో ఆకర్షణ ఏంటంటే.. చిరంజీవి, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ఈ చిత్రానికి సపోర్ట్ చేస్తుండడం. ఈ మూవీ ట్రైలర్ ని మెగాస్టార్ రిలీజ్ చేస్తూ మూవీ (Mangalavaaram) టీంని ప్రత్యేకంగా అభినందించారు. అందుకు కారణం కూడా చిరంజీవి అప్పుడే తెలియజేశారు. ఈ చిత్ర నిర్మాత స్వాతి రెడ్డి చిరు కూతురు శ్రీజకి మంచి స్నేహితురాలు అని చెప్పుకొచ్చారు. ఇక షూటింగ్స్ తో బిజీగా ఉంటున్న అల్లు అర్జున్.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం డేట్స్ ని అడ్జస్ట్ చేసుకొని మరి వస్తున్నారు. దీంతో ఆడియన్స్ అసలు ఆ నిర్మాత ఎవరు అని అరా తీయడం మొదలు పెట్టారు.

స్వాతి రెడ్డి మరెవరో కాదు.. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి, ప్రముఖ వ్యాపారవేత్త అయిన నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు. స్వాతి 2016లో మరో పారిశ్రామికవేత్త గునుపాటి శివకుమార్ తనయుడు ప్రణవ్‌ ను పెళ్లి చేసుకున్నారు. దీంతో నిర్మాతగా ఆమె పేరుని స్వాతిరెడ్డి గునుపాటి అని పేర్కొన్నారు. అలా కాకుండా స్వాతి నిమ్మగడ్డ అని వేసి ఉంటే ప్రేక్షకులు ఇట్టే కనిపెట్టేసేవారు. నిమ్మగడ్డ ప్రసాద్ కి మెగా ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్ తో మంచి రిలేషన్ ఉంది. ఈ బంధం వలనే చిరంజీవి, అల్లు అర్జున్ ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar