Site icon Prime9

Director Raghavendra Rao: డైరెక్టర్ రాఘవేంద్ర రావుకు హైకోర్టు నోటీసులు.. కారణం అదేనా ??

high-court-nitices-to-tollywood-director-raghavendra-rao

high-court-nitices-to-tollywood-director-raghavendra-rao

Director Raghavendra Rao: చిక్కుల్లో పడ్డ  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు .తెలంగాణా హైకోర్ట్ నుంచి నోటీసులు. ఓభూమికి సబంధిచిన వివాదంలో నోటీసులు వచ్చినట్టు తెలుస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన భూమిని ఆయన సొంత అవసరాలు వాడుకున్నారన్న ఆరోపణలు ఫేస్ చేస్తున్నారు రాఘవేంద్ర రావు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని దర్శకుడు రాఘవేంద్రరావు సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. రాఘవేంద్ర రావుకు, ఆయన బంధువులకు మరోసారి నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ప్రాంతంలోని షేక్‌పేటలో 2 ఎకరాల భూమిని ప్రభుత్వం ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం కేటాయించింది. అయితే అది ఇండస్ట్రీ డెవలప్ మెంట్ కోసం కాకుండా.. తన సొంత అవకసరాలకోసం దర్శకుడు వాడుకున్నారని ఆరోపణ. రాఘవేంద్ర రావు పై మెదక్‌కు చెందిన బాలకిషన్ అనే వ్యక్తి 2012లో ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సర్వే నెం.403/1లోని 2 ఎకరాల భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ఇక మరోవైపు నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రీలీల బాలయ్య కుమార్తెగా నటించగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం విజయం సాధించిన సందర్భంగా నిన్న సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకకి రాఘవేంద్ర రావు అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పలు పొలిటికల్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.

ఈ చిత్రంలో బాలయ్య నటించిన ఎమోషనల్ సీన్స్ చూస్తే స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు అని ఆయన అన్నారు. బాలయ్య డైలాగ్ చెబితే బాంబు పేలినట్లుగా ఉంటుంది
కానీ బాంబు కన్నీళ్లు పెట్టుకోవడం చూశా. బాలయ్యకి సీజన్ తో సంబంధం లేదు. వర్షాకాలం అయితే చినుకు జై బాలయ్య అంటూ శబ్దం చేస్తాయి. వేసవిలో సూర్య కిరణాలు కూడా జై బాలయ్య అంటూ వస్తాయి. చలికాలంలో పిల్లగాలికి పచ్చ జెండాలు జై బాలయ్య అంటూ రెపరెపలాడతాయి. అలానే హిందూ పురంలోనే కాదు ఆంధ్ర మొత్తం పచ్చ జెండాలు రెపరెపలాడతాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version