Nani 30: నాచురల్ స్టార్ నాని ఊరమాస్ అండ్ రగ్గడ్ లుక్స్ ఇటీవలే విడుదలయ్యి భారీ హిట్ కొట్టిన సినిమా దసరా. కాగా ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ విజయంతో నాని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అయితే ప్రస్తుతం నాని తన 30వ సినిమాను తెరకెక్కిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో నాని మరోసారి నాన్నగా కనిపించబోతున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఈ మూవీ రాబోతున్నట్టు గతంలోనే చిత్ర బృందం తెలిపింది. ఈ మూవీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రుతి హాసన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలోనూ నాని నాన్న స్టోరీ(Nani 30)
ప్రస్తుతం నాని 30వ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇటీవలె నాని ఈ మూవీకి సంబంధించిన మేజర్ అప్డేట్ ని ఇచ్చాడు. ఆకాశంలో పారాగ్లైడింగ్ చేస్తూ ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ ని జులై 13న రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే నేడు తాజాగా ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.
నాని 30వ సినిమాకి ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు ప్రకటించారు. అలాగే దీనికి సంబంధించిన చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో నాని, మృణాల్ ఠాకూర్, నానికి కూతురుగా కనిపించే పాపని చూపించారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ స్టోరీ అని, సినిమాలో నాని భార్య చనిపోవడంతో పాపతో నాని జీవిస్తుంటాడని.. కాగా పాప ద్వారానే మృణాల్ నాని లైఫ్ లోకి వస్తుంది అని అర్ధమవుతుంది. గతంలోనూ జెర్సీ సినిమా ద్వారా నాన్న ఎమోషన్ తో నాని ఆల్రెడీ ప్రేక్షకులని ఎంతగానో మెప్పించాడు. ఒక్కో సీన్ లో అయితే థియోటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకులయితే కంటతడి పెట్టేశారనుకోండి. ఇప్పుడు మళ్ళీ హాయ్ నాన్న అంటూ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు నాని. ఇక ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
She calls me that…
Not the little one 😉Glimpsehttps://t.co/oY0v1h84Ms pic.twitter.com/KrU3U8kaPS
— Nani (@NameisNani) July 13, 2023