Site icon Prime9

#BroFirstSingle: ఇంట్రో ఆపు..దుమ్ము లేపు.. డ్యాన్స్ బ్రో అంటూ “మై డియర్ మార్కండేయ” ఫస్ట్ లిరికల్‌ సాంగ్ రిలీజ్‌

#BroFirstSingle

#BroFirstSingle

#BroFirstSingle: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ మై డియర్ మార్కాండేయ సాంగ్ నెట్టింట విడదలయ్యి రచ్చ చేస్తుంది. ఈ సాంగ్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో పాటు బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వ‌శీ రౌతేలా కనిపించి అలరించారు. ఈ పాట‌ని ప్ర‌త్యేకంగా వేసిన భారీ సెట్‌లో చాలా గ్రాండ్ గా చిత్రీక‌రించినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ పాటకు రామ‌జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించ‌గా, త‌మ‌న్ త‌న‌దైన బాణీల‌తో ఆక‌ట్టుకున్నారు. రేవంత్‌, స్నిగ్ధ‌శ‌ర్మ ఈ పాటను ఆల‌పించారు.

`ఇంట్రో ఆపు..దుమ్ము లేపు డ్యాన్స్ బ్రో..లైక్ బ్రో.. హే క‌మాన్ క‌మాన్ డ్యాన్స్ బ్రో.. య‌మా య‌మా బీట్స్ బ్రో.. జింద‌గీనె జూక్ బాక్స్ బ్రో.. హే ర‌చ్చో ర‌చ్చా రాక్స్ బ్రో.. మ‌జా పిచ్చా పీక్స్ బ్రో.. మ‌న‌ల్నాపె మ‌గాడెవ‌డు బ్రో.. అరె ఎటూ చూస్తే ప్రి లైఫ్ షార్ట్ ఫిల్మూ.. మైడియ‌న‌ర్ మార్కండేయా మంచి మాట చెప్తా రాసుకో.. మ‌ళ్లి పుట్టి భూమ్మీదికి రానే రావు నిజం తెలుసుకో.. అంటూ అర్థ‌వంత‌మైన ప‌దాల‌తో పాట సాగింది. ఈ పాట‌లో సాయి ధ‌ర‌మ్ తేజ్ మ‌రింత జోష్ గా క‌నిపించ‌గా, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌దైన మార్కు స్వాగ్‌తో ఎంట్రీ ఇచ్చేసి ర‌చ్చ చేశారు. త‌మ‌న్ ఈ పాట‌కు అందించిన సంగీతం, బీజీఎమ్స్ అయితే ఓ రేంజ్‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్ చేత స్టెప్పులేయిస్తాయనడంలో సందేహం లేదు.

శరవేగంగా ప్రమోషన్స్(#BroFirstSingle)

మామా అల్లుళ్ళు కలిసి మొదటిసారి ఒక సినిమా చేస్తుండడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కాగా తమిళ హిట్ చిత్రం ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా వస్తుండగా.. తెలుగు నేటివిటీ, పవన్.. తేజు ఇమేజ్ కి తగ్గట్లుగా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన పవన్, సాయి పోస్టర్లు అందర్నీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గానే రిలీజ్ చేసిన టీజర్ కు అయితే నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇంతటి భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ సినిమా జూలై 28న థియేట‌ర్ల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా సంద‌డి చేయ‌బోతోంది. సినిమా రిలీజ్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ వేగం పెంచింది. ఇందులో భాగంగానే శ‌నివారం ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్‌గా `మైడియ‌ర్ మార్కండేయ‌` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేసింది.

Exit mobile version