Site icon Prime9

Anushka Shetty : వెండితెర మహారాణి, సూపర్ స్టార్ “అనుష్క” కి హ్యాప్పీ బర్త్ డే..

fans and celebraties wishes to anushka shetty for her birth day

fans and celebraties wishes to anushka shetty for her birth day

Anushka Shetty : అక్కినేని నాగార్జున – పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన “సూపర్” సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనుష్క శెట్టి. 2005 లో వచ్చిన ఈ మూవీలో ఆమె అందం అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది స్వీటి. ఆ తర్వాత ఆమె నటించిన పలు సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించలేకపోయినా విక్రమార్కుడు చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస చిత్రాలతో అమ్మడు దూసుకుపోయింది అని చెప్పాలి.

ఇక కోడి రామకృష్ణ తెరకెక్కించిన “అరుంధతి” మూవీలో ఆమె నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసింది. ఆ సక్సెస్ తో టాలీవుడ్ లో టాప్ రేంజ్ కి ఎదిగింది స్వీటి. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు సొంతం చేసుకుంటూ నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. ఓవైపు స్టార్ హీరోల అందరితో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూనే.. మరోవైపు సోలోగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పించడం ఈ దశాబ్దంలో అనుష్క శెట్టికే సాధ్యమైంది. మిగతా హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ సిన్మాలు చేసినా.. అనుష్క లాగా సక్సెస్ కాలేకపోయారు. సూపర్, ల‌క్ష్యం, శౌర్యం, విక్రమార్కుడు, చింత‌కాయ‌ల ర‌వి, డాన్, బిల్లా లాంటి సినిమాల్లో గ్లామర్ ఒలబోసిన అనుష్క.. వేదం సినిమాలో సరోజ క్యారెక్టర్‌లో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఇక పంచాక్షరి, వర్ణ, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి, నిశ్శబ్దం వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. టాలీవుడ్ లో అనుష్క చేసినన్ని ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాలు ఇటీవల కాలంలో మరే హీరోయిన్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. బాహుబలి సినిమాలోని ‘దేవసేన’ పాత్రలో అనుష్క నటన ఆమెను కెరీర్‌లో అగ్ర స్థానంలో నిలబెట్టింది. ‘సైజ్ జీరో’ సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ సినిమా పట్ల ఆమెకున్న కమిట్ మెంట్ తెలియజేసింది. చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో చిరస్మరణీయమైన పాత్రలో కనిపించారు.

ఇటీవల అనుష్క నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అనుష్క చేసిన అన్విత క్యారెక్టర్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఈ సినిమాలో స్వీటీ తన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. త్వరలో అనుష్క తన 50వ సినిమా భాగమతి-2ని యూవీ క్రియేషన్స్ భారీగా ప్లాన్ చేసిందని సమాచారం అందుతుంది. చూడాలి మరి.. ఇక ఈ క్రమం లోనే పలువురు ప్రముఖులు, అభిమానులు అనుష్క కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా లో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.

 

Exit mobile version