Site icon Prime9

Harish Shankar : హరీష్ శంకర్ ని క్షమించమని కోరిన అభిమాని.. రెస్పాండ్ అయ్యి.. ఏం చెప్పారంటే?

fan apolozies to diector harish shankar and tweet goes viral

fan apolozies to diector harish shankar and tweet goes viral

Harish Shankar : తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖ దర్శకులలో హరీష్ శంకర్ కూడా ఒకరు. పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ఒకటి. ఈ సినిమాకి హరీష్ శనకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రంలో అశుతోష్ రానా, కెజిఎఫ్ అవినాష్, నవాబ్ షా లాంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తోడవ్వడం మరో ఇంటరెస్టింగ్ విషయం.  వరుసగా ఫ్లాప్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కు హరీష్ పెద్ద హిట్ ఇవ్వడంతో సినిమా వచ్చి పదేళ్లపైనే అవుతున్నా ఇంకా పవన్ అభిమానులు హరీష్ శంకర్ ని అభిమానిస్తూనే ఉంటారు. ఇటీవలే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి మరోసారి పవన్ అభిమానుల్లో జోష్ నింపారు హరీష్.

ఇక హరీష్ శంకర్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. కేవలం సినిమా అప్డేట్ లు మాత్రమే కాకుండా సామాజిక అంశాలకు కూడా స్పందిస్తూ ఉంటారు. ఉస్తాద్ భగత్ సింగ్ తేరి రీమేక్ అని వార్తలు వచ్చినప్పుడు ఆ రీమేక్ అయితే వద్దు అని పవన్ ఫ్యాన్స్ కూడా కొంతమంది బూతులు తిడుతూ హరీష్ శంకర్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ చేయడంతో వాళ్ళని కూడా హరీష్ శంకర్ బ్లాక్ చేశాడు. ఈ విషయంలో పలువురు హరీష్ శంకర్ ని విమర్శిస్తున్నారు. ఎందుకు బ్లాక్ చేస్తున్నారు, విమర్శలు తీసుకోలేరా అంటూ హరీష్ కి ట్వీట్స్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా హరీష్ శంకర్ ని ఓ అభిమాని క్షమాపణ అడగడం అందుకు హరీష్ శంకర్ రెస్పాండ్ అవ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓ పవన్ అభిమాని తన ట్వీట్ లో.. సారీ అన్నా.. మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకున్నాం. గ్లింప్స్ చూసిన తర్వాత గిల్టీగా ఫీల్ అవుతున్నాం. ఒక్క గ్లింప్స్ తో అందరి నోళ్లు మూయించావు. నా ఆనందం మాటల్లో చెప్పలేను అన్నయ్య. మీరు బ్లాక్ చేసిన వాళ్ళందరిని దయచేసి అన్ బ్లాక్ చేయండి అని హరీష్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.

దీనికి హరీష్ శంకర్ సమాధానమిస్తూ.. మనలో మనకు గిల్టీ ఫీలింగ్ ఏంటి తమ్ముడు. మనమంతా ఒక్కటే. సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. నేను బూతులు మాట్లాడిన వాళ్ళను మాత్రమే బ్లాక్ చేశాను. విమర్శలను తీసుకోవడానికి నేనెప్పుడూ ఇబ్బంది పడను అని ట్వీట్ చేశారు. దీంతో హరీష్ శంకర్ ట్వీట్ వైరల్ గా మారింది.

 

షాక్ సినిమాతో దర్శకుడిగా మారిన హరీష్ శంకర్ ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన మిరపకాయ్ భారీ హిట్ సాధించి హరీష్ శంకర్‌ను స్టార్ డైరెక్టర్‌గా నిలబెట్టింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్.. భారీ హిట్ సాధించిన దబాంగ్ సినిమా రీమేక్ అయినప్పటికీ తెలుగులో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ కి తగ్గట్టు హరీష్ చేసిన మార్పులు, టేకింగ్ ఏ అంతటి విజయానికి కారణం అని చెప్పాలి.  కాగా 2019లో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ తర్వాత మరే చిత్రం చేయలేదన్న విషయం తెలిసిందే.

Exit mobile version