Site icon Prime9

Kangana Ranaut: ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్

Bollywood: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి తన అభిమానులను షాక్‌కు గురి చేసింది. గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన తదుపరి చిత్రం ‘ఎమర్జెన్సీ’ ఫస్ట్ లుక్ టీజర్‌ను షేర్ చేసింది. ఇందులో బాలీవుడ్ నటి భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తోంది. ప్రోమోలో, కంగనా ఇందిరా గాంధీ వేషధారణలో కళ్ళజోడు మరియు కాటన్ చీర ధరించి కనిపించింది.

అమెరికన్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ తనను సర్ అని కాకుండా ‘మేడమ్’ అని పిలవాలనుకుంటున్నట్లు ఫోన్ వచ్చిందని ఆమె సెక్రటరీ చెబుతాడు. ముందు ఓకే అన్న ఇందిర తర్వాత తన సెక్రటరీ వైపు తిరిగి తన ఆఫీసులో అందరూ తనను ‘సర్’ అని సంబోధిస్తున్నారని తెలియజేయమని కోరుతుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేస్తూ ‘సర్’ అని పిలిచే ‘ఆమె’ని ప్రెజెంట్ చేస్తున్నాను #ఎమర్జెన్సీ షూట్ ప్రారంభమవుతుంది. “#ఎమర్జెన్సీ ఫస్ట్‌లుక్‌ను ప్రదర్శిస్తున్నాను. ప్రపంచ చరిత్రలో అత్యంత శక్తివంతమైన మరియు వివాదాస్పద మహిళల్లో ఒకరిని చిత్రీకరిస్తున్నాను. #ఎమర్జెన్సీ షూట్ ప్రారంభమవుతుంది. అంటూ కంగనా రాసింది.

Exit mobile version