Site icon Prime9

Trivikram Srinivas : BMW కారు కొన్న డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్

BMW

BMW

Tollywood News: మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ సిసినిమాలు ఎమోషనల్ మరియు కామెడీ సన్నివేశాలతో నిండి ఉంటాయి. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు అతని భార్య సౌజన్య ఒక లగ్జరీ కారు – BMW కొన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ బీఎండబ్ల్యూ కారు కొంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. . సాధారణంగా మార్కెట్‌లో ఆ కారు ధర రూ. 1.34 కోట్లు. అంతేకాకుండా ఆ కారులో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.75 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన భార్య సౌజన్యతో కలిసి BMW కారును డెలివరీ తీసుకుంటున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి #SSMB28 కోసం పని చేస్తున్నారు. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ హఠాన్మరణంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ మహేష్ షూటింగ్ లో పాల్గొంటాడని చెబుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. ఇక రెండో షెడ్యూల్ డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Exit mobile version