Site icon Prime9

Director SS Rajamouli : దర్శకధీరుడు జక్కన్నకు దక్కిన మరో అరుదైన గౌరవం.. ఈసారి సినిమాల్లో కాదు !

Director SS Rajamouli honoured as isbc chairman

Director SS Rajamouli honoured as isbc chairman

Director SS Rajamouli : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. డైరెక్టర్ గా సీరియళ్ళతో తన ప్రస్థానం ప్రారంభించిన జక్కన్న స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తనదైన సినిమాలను డైరెక్ట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. ఇక “ఆర్ఆర్ఆర్” చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ చిత్రం సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అవార్డును గెలుచుకుంది. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఆరుగురు సభ్యులకు ఆస్కార్ కమిటీలో అవకాశం కూడా లభించింది. ఇక ఈ మూవీతో జక్కన్న తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా మరింతగా చాటిచెప్పారు.

కాగా సినిమాల పరంగా ఎన్నో అవార్డులు అందుకున్న రాజమౌళిని (Director SS Rajamouli) తాజాగా మరో గౌరవంతో పురస్కరించారు. ఏంటంటే.. ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ఐఎస్‌బీసీ) నూతన చైర్మన్‌గా డైరెక్టర్ రాజమౌళి నియమితులు అయ్యారు. ఇప్పటికే ఐఎస్‌బీసీకి జాయింట్ సెక్రెటరీగా రాజమౌళి కుమారుడు కార్తికేయ ఉన్నారు. త్వరలోనే ఐఎస్‌బీసీ చైర్మన్‌గా రాజమౌళి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సంస్థకు చీఫ్‌ ప్యాట్రన్‌గా బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ ఉండగా.. వెటరన్‌ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కారు ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభను ప్రోత్సహించేందుకు.. ఇండియాలో స్కూల్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లు తమ టాలెంట్‌‌‌‌‌‌‌‌ ని నిరూపించుకునేందుకు ఓ వేదికను అందించడంతో పాటు.. వారికి మార్గ నిర్దేశంలో తోడ్పాటుని ఇచ్చేందుకు ఈ సంస్థని స్థాపించారు. మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌‌‌‌‌‌‌‌సర్కార్ మార్గనిర్దేశంలో ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ఐఎస్‌‌‌‌‌‌‌‌బీసీ) ఏర్పాటైన విషయం తెలిసిందే. టాలెంట్‌‌‌‌‌‌‌‌ ఉన్నప్పటికీ అవకాశాలు, సదుపాయాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది విద్యార్థులను ప్రోత్సహించడమే ఐఎస్‌‌‌‌‌‌‌‌బీసీ ప్రధాన లక్ష్యమని ఫౌండర్‌‌‌‌‌‌‌‌, సీఈవో కె. సునీల్ బాబు గతంలో చెప్పారు. మరి జక్కన్న ఈ సంస్థ ద్వారా మరింత మందికి తన విజన్ తో విజయం అందించాలని కోరుకుంటూ పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు.

ఇక రాజ‌మౌళి (Director SS Rajamouli) సినిమాల విష‌యానికి వ‌స్తే RRR త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబుతో సినిమా చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. SSMB 29గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Exit mobile version