Site icon Prime9

RC15 Update: ఆర్సీ15 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శంకర్

RC 15 prime9news

RC 15 prime9news

Tollywood: శంకర్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ గురించి కొన్ని రోజుల నుంచి ఒక రేంజులో రూమర్లు వస్తున్నాయి. ఈ సినిమా వదిలేసి కమలహాసన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ, రామ్ చరణ్ పరిస్థితి ఏంటి అని, ఇలా ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆర్ట్ డైరెక్టర్ విషయంలో సమస్యలు రావడంతోనే రామ్ చరణ్ సినిమా ఆగిపోయిందని, శంకర్ అందుకే ఇండియన్ 2 ప్రారంభించాడని వార్తలు వచ్చాయి. ఇక రామ్ చరణ్ శంకర్ ప్రాజెక్ట్ కొన్ని రోజుల పాటు ఆగిపోనుందనే రక రకాల కథనాలు వచ్చాయి. శంకర్ ట్విట్టర్లో ట్వీట్ చేసి, ఇలా వస్తున్నా రూమర్లలన్నింటికి చెక్ పెట్టేశాడు.

అయితే వాటిపై శంకర్ ట్విట్టర్లో ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చాడు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో హైద్రాబాద్, వైజాగ్‌లో షూటింగ్‌కు రెడీగా ఉండండి అంటూ అందరికి ఘాటుగా రిప్లై ఇచ్చాడు ఇది వరకే కొంత మంది కథనాలు రాశారు. ఇప్పుడు శంకర్ రెండు సినిమాలను ఒకే సారి పట్టాలెక్కిస్తాడని ఎవరు కలలో కూడా అనుకోలేదు. నెలలో పదిహేను రోజులు ఆర్సీ15 సినిమా షూటింగ్, ఇంకో పదిహేను రోజులు ఇండియన్ 2 సినిమా షూటింగుకు తిరుగుతూ ఉంటాడట.

మొత్తానికి రామ్ చరణ్ ప్రాజెక్ట్ మాత్రం త్వరలోనే సెట్స్ మీదకు రాబోతోంది. ఇన్ని రోజులు ఈ ప్రాజెక్ట్ గురించి ఏ అప్డేట్ రాకపోవడంతో అభిమానులు కాస్త ఆందోళ చెందారు. ఇక డైరెక్టర్ శంకర్ ఇలా నేరుగా ట్వీట్ వేయడం, సెప్టెంబర్ మొదటి వారంలోనే హైద్రాబాద్ వైజాగ్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ ఉంటుందని తెలపడంతో అభిమానులందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆర్సీ 15 సినిమాలో శ్రీకాంత్, అంజలి, సముద్రఖని వంటి వారు నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణి నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

 

Exit mobile version