Site icon Prime9

Krishna Vamsi: మొదటి సారి కొడుకు గురించి నోరు విప్పిన డైరెక్టర్ కృష్ణ వంశీ

krishna vamsi prime9news

krishna vamsi prime9news

Krishna Vamsi: టాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్స్ లిస్టులో కృష్ణ వంశీ కూడా ఒకరు. గులాబీ, సింధూరం, ఖ‌డ్గం, అంతఃపురం లాంటి సినిమాల‌తో అందరి దృష్టిని తన వైపుకు మళ్లించుకున్న ఈ డైరెక్టర్ 2017 న నక్ష‌త్రం అనే సినిమాకు దర్శకత్వం వహించిన మన అందరికీ తెలిసిన విషయమే.ఈ సినిమా ఫ్లాప్ ఐన త‌ర్వాత ఇతను ఏ సినిమాకు మళ్ళీ డైరెక్ట్ చేయలేదు. ఇలా 5 ఏళ్లు త‌ర్వాత కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన చేసిన సినిమా‘రంగ మార్తాండ’.ఈ సినిమా మరాఠీ ‘నట సామ్రాట్’ సినిమాకు రీమేక్.ఈ సినిమా అతి త్వ‌ర‌లోనే రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతుందని టాలీవుడ్లో గుస గుస. చంద్ర లేఖ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ర‌మ్య‌కృష్ణ‌ , కృష్ణ వంశీకు పరిచయమయ్యి తరువాత ఇద్దరు ఒకరినోకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఐతే కృష్ణ వంశీ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో త‌న సినీ జీవితం,ర్య‌మ‌కృష్ణ ఉన్న రిలేష‌న్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను బయటికి వెల్లడించారు.అవి తెలుసుకోవాలనుకుంటే ఈ కంటెంటును చివరి వరకు చదవండి.

కృష్ణ వంశీ మాట్లాడుతూ ‘‘నాకు ర‌మ్య‌కృష్ణకు కాంపిటిష‌న్ ఎప్పుడూ ఉంటుందని నాలుగు ఏళ్ళు నుంచి నేను కొంచం తగ్గి ఉంటున్నానని, అప్పుడ‌ప్పుడూ మా మ‌ధ్య గ్యాప్ వచ్చిన మా బంధం ఎప్పటికీ బలంగానే ఉంటుందని, నాకు ఖాళీ సమయం దొరికిన వెంటనే నేను చెన్నైకి వెళ్లిపోతా..ఆమెకు ఖాళీ సమయం దిరికినప్పుడు ఆమె ఇక్క‌డికి వ‌స్తుందని తెలిపారు.ఇక మా కొడుకు విషయానికి నా కొడుకును ముద్దుగా బెబోఅని అంటాం. మా అబ్బాయి అసలు పేరు రిత్విక్,వాడు ఆలోచించే విధానం డిఫరెంటని ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటాడని ప్రస్తుతం రిత్విక్‌కి టీనేజ్‌ వయస్సు కానీ మా అబ్బాయిలో అన్నీ కళలు ఉన్నాయని తెలుగు, త‌మిళం, డైరక్ష‌న్‌,యాక్టింగ్ అన్నీ కవర్ చేస్తాడనీ కానీ వాడు చదివేది మాత్రం ప‌దో త‌ర‌గ‌తని తెలిపాడు. ఒక వారం ఏమో క్రికెట్ మీద ధ్యాస ఉంటే ఇంకో వారం ఏమో బిజినెస్ మీద ఉంటుంది. పెరిగింది మ‌ద్రాసులోకదా అక్కడే ఉండే జనాలు చాలా యాక్టివ్‌గా ఉంటారని తెలిపాడు.

ఇక మా మీద అనేక రకాల రుమార్లు వస్తున్నాయి అవి అన్ని పట్టించుకుంటే మేము మా పనులను చేసుకోలేం కానీ మా అభిమానులందరికి ఒక్క మాట చెప్తాను.నేను రమ్య కృష్ణ కలిసే ఉంటున్నాం.మాగురించి రూమర్స్ వచ్చినా మీరు బాధ పడకండి, కంగారూ పడకండని ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Exit mobile version