Site icon Prime9

Anudeep: గాడ్ ఫాదర్ బోరింగ్ సినిమా.. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ సంచల కామెంట్స్

director anudeep kv comments on god father movie

director anudeep kv comments on god father movie

Anudeep: దసరా బరిలో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ లు చూస్తున్న మెగాస్టార్ కు ఈ సినిమా మంచి హిట్ ఇచ్చిందనే చెప్పవచ్చు. ఇక ఈ చిత్రం చూసిన పలువురు సెలబ్రెటీలు మూవీ బాగుందంటూ రివ్యూ ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ మాత్రం తనకు గాడ్ ఫాదర్ సినిమా ఏమాత్రం నచ్చలేదని, బోరింగ్ అంటూ సంచల వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

జాతిరత్నాలు మూవీతో ఇండస్ట్రీలో మంచి హిట్ అందుకున్న దర్శకుడు అనుదీప్ తాజాగా ప్రిన్స్ మూవీతో మరో హిట్ సినిమా చేశాడు. కాగా ఈయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో యాంకర్ అనుదీప్ ను గాడ్ ఫాదర్ సినిమా గురించి ఓ ప్రశ్న అడిగింది. దానికి అతను చాలామంది తనని గాడ్ ఫాదర్ సినిమా చూశారా అంటూ ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఇలా అందరూ అడగడంతో తాను గాడ్ ఫాదర్ సినిమా చూశానని అయితే తనకు ఆ సినిమా ఏ మాత్రం నచ్చలేదని చాలా బోరింగ్ గా ఉందంటూ సమాధానం చెప్పారు. ఈ వ్యాఖ్యలు విన్న యాంకర్ ఒక్కసారిగా అవాక్కవుతూ.. మీరు ఏ గాడ్ ఫాదర్ గురించి చెబుతున్నారు అంటూ క్లారిటీగా అడిగింది. దానికి అనుదీప్ హిందీ మూవీ గాడ్ ఫాదర్ గురించి చెబుతున్నానని ఆ సినిమా నాకు ఏమాత్రం నచ్చలేదంటూ చివరిలో ట్విస్ట్ ఇచ్చారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. దానితో కొందరు చిరంజీవి గాడ్ ఫాదర్ గురించే అనుదీప్ మాట్లాడి ఉంటారని చివరిలో ఇలా మాట మార్చారు అంటూ నెటిజన్లు కామెంట్ లు చేస్తున్నారు.

ఇదీ చదవండి: “కార్తీకదీపం” అన్ స్టాపబుల్.. అరుదైన మైలురాయిని దాటిన వంటలక్క సీరియల్

Exit mobile version