Dil Raju: దిల్ రాజు.. ఈ కాలంలో ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలు చూసే ప్రతి ఒక్కరికి ఈ పేరు సుపరిచితం. మంచి ప్రొడ్యూసర్ గా.. డిస్ట్రిబ్యూటర్ గా ప్రతి ఒక్కరికి తెలిసిందే. తక్కువ కాలంలోనే ఈయన సినిమా రంగంతో పాటు.. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
రాజకీయాల్లోకి రానున్నారా? (Dil Raju)
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి అందరికి తెలిసిందే. వరుస హిట్ సినిమాలతో ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా వేణు టిల్లు దర్శకత్వంలో వచ్చిన బలగం అనే సినిమాతో మరో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా విజయంతో జోష్ మీదున్న దిల్ రాజు గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే దిల్ రాజు రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ దీనిపై ఆయన ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. ఇందులో అందులో భాగంగానే నిజమాబాద్ ఏరియాలో ఎక్కువ సమయం.. ప్రజలతో తిరుగుతూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలుస్తోంది. ఇదే విషయం టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో దిల్ రాజు.. నిజామాబాద్ ఎంపీగా పోటి చేయాలని అనుకుంటున్నారట. మరోవైపు.. అలా కాకుండా నేరుగా రాజ్యసభకు వెళ్తారని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా కాదా అని తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ ఏడాదిలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి అప్పటి వరకు ఆగాల్సిందే.
నిజామాబాద్ తో ప్రత్యేక అనుబంధం..
దిల్ రాజు స్వస్థలం నిజామాబాద్ జిల్లాలోని నర్సింగిపల్లి. సొంత ఊరు కావటంతో.. దిల్ ఎన్నికల్లో పోటి చేయనున్నట్లు సమాచారం. ఇక్కడి ప్రజలతో తరచూ దిల్ రాజు టచ్ లో ఉంటున్నారని తెలుస్తోంది. ఇక దిల్ రాజు వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించారు. కొన్నాళ్లపాటు దిల్ రాజు ఒంటరిగానే జీవించారు. ఆ తర్వాత దిల్ రాజు కరోనా సమయంలో తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు. ఇటీవల ఈ జంట ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా దిల్ రాజు కొన్నిఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దిల్ రాజు ఓ సమయంలో విమాన ప్రయాణం చేసే సమయంలో తేజస్విని పరిచయం అయ్యిందని.. ఆ తర్వాత ఇంట్లో వాళ్లతో డిస్కస్ చేశాకా పెళ్లి చేసుకున్నామని తెలిపారు. ఇక దిల్ రాజు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేశారు. అదే వారిసు. మాస్టర్, బీస్ట్ సినిమాల తర్వాత తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన కొత్త సినిమా వారిసు. ఈ చిత్రంలో తెలుగులో వారసుడుగా డబ్ అయ్యింది. విజయ్ కెరీర్‌లో 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తెలుగు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు.