Site icon Prime9

Dil Raju: ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ పోస్టర్స్‌పై దిల్‌ రాజు రియాక్షన్‌ – ఏమన్నారంటే!

Dil Raju Reacts on Game Changer Collection Poster: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరో శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య జవనరి 10న రిలీజైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఫస్ట్‌ డే డివైడ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ఫస్ట్‌ డే రూ. 186 పైగా కలెక్షన్స్‌ చేసినట్టు మేకర్స్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. అయితే అవి ఫేక్‌ కలెక్షన్స్‌ అని ఆడియన్స్‌కి తప్పుడు లెక్కలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. డివైడ్‌ టాక్‌ వచ్చిన ఈ సినిమా అన్ని కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

దీంతో నిర్మాత దిల్‌ రాజుపై నెటజన్స్‌ విమర్శలు గుప్పించారు. నిజానికి ‘గేమ్‌ ఛేంజర్‌’కు వచ్చిన కలెక్షన్స్‌ మాత్రం రూ. 80 కోట్లు మాత్రమే వచ్చాయని ట్రేడ్‌ వర్గాల నుంచి సమాచారం. అయితే ఫేక్‌ కలెక్షన్స్‌ ప్రకటించడంపై ఇప్పటికే దిల్‌ రాజుకు పలుమార్లు ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ ఆయన తమకు కొన్ని వీక్‌నెస్‌లు ఉంటాయంటూ ప్రశ్నను దాటవేస్తు వస్తున్నాయి. అయితే మరోసారి ఆయనకు గేమ్‌ ఛేంజర్‌ కలెక్షన్ల పోస్టర్‌పై ప్రశ్న ఎదురైంది.

దిల్‌ రాజు నిర్మించిన రెండు సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్‌ అయ్యాయి. అవే గేమ్‌ ఛేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు. ఇందులో సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా రూ.300లకు పైగా కలెక్షన్స్‌ చేసింది. మూవీ భారీ విజయం సాధించిన సందర్భంగా డిస్ట్రిబ్యూటర్స్‌ గ్రాటిట్యూడ్‌ మీట్‌ పేరుతో మేకర్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దిల్‌ రాజుకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. గేమ్‌ ఛేంజర్‌ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ మాత్రమే షేర్‌ చేశారు. కానీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ కలెక్షన్స్‌ మాత్రం చాలా పోస్టర్స్‌ రిలీజ్‌ చేశారు. గేమ్‌ ఛేంజర్‌ వసూళ్లు తప్పుగా ప్రకటించారనే అభిప్రాయాలు ఉన్నాయని, మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించారు.

దీనికి దిల్‌ రాజు స్పందిస్తూ అసహనం చూపించారు. గేమ్‌ ఛేంజర్‌ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ పోస్టర్‌ మీ ప్రొడక్షన్‌ నుంచే వచ్చిందా? అని ప్రశ్నించారు. దీనికి దిల్‌ రాజు స్పందిస్తూ.. “మీరేం అనుకుంటున్నారు. మీకు ఏం తెలుసు. నేను ఇప్పటికే చెప్పాను. మాకు వీక్‌నెస్‌ ఉంటదని, మాట్లాడలేం అని చెప్పాను. మరి మీకు ఏం తెలుసు” అని అసహనం చూపించారు. ఆ వెంటనే డిస్ట్రిబ్యూటర్‌ మాట్లాడుతూ.. మేకర్స్‌ చేసిన పోస్టర్స్‌ చూసి జనాలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Exit mobile version