Site icon Prime9

Karthikeya 2 Success Meet: వాస్తవాలు రాయండి లేకపోతే మూసుకుని కూర్చోండి.. మీడియా పై దిల్ రాజు ఫైర్

Tollywood: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కార్తికేయ 2ని వాయిదా వేయాలని ఒత్తిడి తెచ్చి హీరో నిఖిల్‌ని ఇబ్బంది పెట్టాడని చాలా పుకార్లు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఈరోజు జరిగిన సినిమా సక్సెస్ ఈవెంట్‌లో దిల్ రాజు తన మౌనాన్ని వీడి భావోద్వేగ ప్రసంగం చేసారు.

నాకు సినిమా అంటే చాలా ఇష్టం, నేను జీవించి ఉన్నంత వరకు ఏ సినిమాకు నష్టం కలిగించే పని చేయను అని దిల్ రాజు అన్నారు. ధాంక్యూ ను జూలై 8న విడుదల చేయాలనుకున్నాం కానీ జూలై 22కి వాయిదా వేసాం. కార్తికేయ 2 టీమ్ తమ సినిమాను ఆగస్ట్ 22న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది. వారి విడుదల తేదీని మార్చమని నేను వారిని అడిగాను. అయితే, మీడియా నాపై ఇష్టానుసారం కథనాలు ప్రసారం చేసిందని దిల్ రాజు ఆరోపించారు.

కార్తికేయ 2 విడుదలను ఆపడానికి ప్రయత్నించినట్లు వచ్చిన పుకార్లను ప్రస్తావిస్తూ దిల్ రాజు ఉద్వేగానికి లోనయ్యారు. నిఖిల్ హ్యాపీడేస్ సినిమా చేసినప్పటి నుండి నాకు తెలుసు. దర్శకుడు చందూ మొండేటి, అభిషేక్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో పాటు అతనితో నాకు మంచి అనుబంధం ఉంది అని దిల్ రాజు అన్నారు. మీరు వాస్తవాలు రాయండి లేకపోతే మూసుకుని కూర్చోండి అంటూ మీడియాకు హెచ్చరిక లాంటిది జారీ చేసారు దిల్ రాజు.

Exit mobile version