Dil Raju to Apologises to Telangana People: తెలంగాణ ప్రజలకు దిల్ రాజు క్షమాపణలు చెప్పారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈ మేరకు దిల్ రాజు వీడియో రిలీజ్ చేశారు. నిజామాబాద్‌లో సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేశాం. నిజామాబాద్‌లో ఈవెంట్ పెట్టడం ఫస్ట్‌టైం. ఫిదా మూవీ సక్సెస్ మీట్ పెట్టాం, ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చేశాం. నిజాబాద్‌తో నాకు ఉన్న అనుబంధం అలాంటి. నిజాబాద్ జిల్లా వాసిగా అక్కడ ఈ ఈవెంట్ చేయాలని నిర్ణయించుకుని చేశాం.
అయితే ఈ కార్యక్రమంలో నేను మన కల్చర్‌లో ఉండే దావత్ గేరించి.. మటన్, తెల్లకల్లు గురించి సంబోధించాను. ఆ మాటల్లో తెలంగాణ వారిని అవమానించానని కొందరు మిత్రులు నెగిటివ్ కామెంట్స్ పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అది నా దృష్టికి వచ్చింది. నా ఉద్దేశం అది కాదు. మన తెలంగాణ కల్చర్, దావత్‌ని నేను మిస్ అవుతున్నాననేది నా మాటల ఉద్దేశం. ఇదే విషయాన్ని నేను ఈవెంట్ చివరిలో కూడా చెప్పాను. సంక్రాంతికి వస్తున్న మా రెండు సినిమాలు రిలీజ్ తర్వాత మన తెలంగాణ కల్చర్ దావత్‌ను సంతోషంగా చేసుకోవాలని ఉందనేది నా వ్యాఖ్యల అంతర్యం.
కానీ దాన్ని అర్థం చేసుకోకుండ కొందరు సోషల్ మీడియాలో నా కామెంట్స్‌పై రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది. ఆ మాట వల్ల మీరంత హర్ట్ అయ్యి ఉంటే నన్ను క్షమించండి. నా ఉద్దేశం అది కాదు. నిజామాబాద్ వాసిగా నేను మన కల్చర్‌కి ఎంతో విలువ ఇస్తాను. బాన్సువాడలో ఫిదా సినిమాను షూటింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పాం. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, బానుమతి పాత్ర ద్వారా తెలంగాణ విలువలను చూపించాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతపెద్ద హిట్ అయ్యిందో మీ అందరికి తెలుసు.
అలాగే అలాగే బలగం సినిమాను కూడా ఇది మా సినిమాని తెలంగాణ ప్రజలు మనసుకు హత్తుకున్నారు. అప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మమ్మల్ని అభినందించారు. ఈ సినిమాపై అన్ని రాజకీయ పార్టీలు సినిమాపై ప్రశంసలు కురిపించి ప్రతి స్టేజ్ దగ్గర అభినందించారు. ఒక తెలంగాణ వాసి, తెలంగాణని అభిమానించే నేను.. తెలంగాణని ఎలా హేళన చేస్తాను? అని అనుకున్నారో నాకు తెలియడం లేదు. నా కామెంట్స్‌లో ఏమైన తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. ఎవరైతే కొందరు తమ మనోభవాలు దెబ్బ తీశాను అనుకుంటున్నారో వారంత క్షమించండి” అని చెప్పుకొచ్చారు.
కాగా సంక్రాంతి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ దిల్ రాజు మాట్లాడుతూ.. దావత్ చేసుకుందామా? చెట్లకాడికి పోయి మటన్ ముక్క, కల్లు తాగుదామా? అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నిజామాబాద్‌లో ఉదయం లెవగానే చెట్టు నుంచి కల్లు తీసుకుని తాగుతామని హీరో వెంకటేష్‌కి వివరించారు. ఆ తర్వాత ఆంధ్రకి వెళితే సినిమా వైబ్ ఇస్తారు.. అదే మా తెలంగాణలో మటన్ ముక్క, కల్లు వైబ్ ఇస్తారు అంటూ కామెంట్స్ చేశారు. వీటిని కొందరు తప్పుబడుతూ దిల్ రాజు వ్యతిరేకంగా పోస్ట్స్ పెడుతున్నారు. తెలంగాణ ప్రజలను ఆయన అవమానించారంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.