Site icon Prime9

Dhanush : ధనుష్ _ శేఖర్ కమ్ముల సినిమా ఫ్రారంభం

Dhanush

Dhanush

Tollywood News: వెంకీ అట్లూరి ద్విభాషా చిత్రం సర్‌తో కోలీవుడ్ హీరో ధనుష్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. అతను మరో తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో కూడా ఓ సినిమా చేయడానికి సైన్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని పూజా వేడుకతో ఈరోజు అధికారికంగా ప్రారంభమయింది.. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.శేఖర్ కమ్ముల క్లాస్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో ప్రసిద్ది చెందారు, ధనుష్ మాస్ హీరో . దీనితో ఈ క్రేజీ కాంబినేషన్‌ ఎలా ఉంటుందనేది ఆసక్తికరమే. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న త్రిభాషా ఎంటర్‌టైనర్. త్వరలోనే మరిన్ని వివరాలను టీమ్ వెల్లడించనుంది. ధనుష్ వెంకీ అట్లూరి సర్ షూటింగ్ పూర్తి చేసాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలవుతుంది.

Exit mobile version