Site icon Prime9

Game Changer : ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి జరగండి సాంగ్ రిలీజ్ పోస్టు పోన్ .. దీపావళి కి రావడం కష్టమే..

details-about-ram-charan-game-changer-movie

details-about-ram-charan-game-changer-movie

Game Changer : ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లో శంకర్ ఒకరు . అలాంటి దర్శకుడితో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా చేస్తున్నారంటే.. ఫ్యాన్స్ లోనే కాదు సినీ పరిశ్రమలో కూడా ఓ రేంజ్ అంచనాలు నెలకుంటాయి. కానీ ఆ మూవీ మెగా అభిమానులను తీవ్ర బాధకి గురి చేస్తుంది. సినిమా షూటింగ్ మొదలయ్యి రెండేళ్లు అయిపోయింది. కానీ మూవీ మాత్రం ఇంకా చిత్రీకరణ పూర్తి చేసుకోలేదు. సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు. మూవీ ఒక పోస్టర్, టైటిల్ తప్ప మరే అప్డేట్ లేదు.

దీంతో అభిమానులు చిత్ర దర్శకనిర్మాతల పై అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక ఇటీవల ఈ మూవీ నుంచి ‘జరగండి’ లీక్ అవ్వడంతో దానిని అఫీషియల్ గా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. దీపావళి కి సాంగ్ రిలీజ్ అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ అప్డేట్ తరువాత మళ్ళీ ఏ అప్డేట్ లేదు.దీంతో రామ్ చరణ్ అప్ డేట్ కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు . సోషల్ మీడియాలో ఒక రూమర్ మొదలయింది. ‘జరగండి’ సాంగ్ రిలీజ్ పోస్టుపోన్ అయ్యిందని, దీపావళికి రావడం లేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి చూసిన అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.

ఈ విషయం గురించి క్లారిటీ కోసం చిత్ర నిర్మాత దిల్ రాజు ని ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తూ వస్తున్నారు. కానీ మూవీ టీం మాత్రం రెస్పాండ్ లేదు. అయితే కొంతమంది చెబుతున్న మాట ఏంటంటే.. పోస్టుపోన్ వార్తలో ఎటువంటి నిజం లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, శంకర్ ఈ సినిమా షూటింగ్ ని పక్కన పెట్టి మళ్ళీ కమల్ ఇండియన్ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ షూటింగ్ ఇండియన్ 2కి సంబంధించింది కాదట ఇండియన్ 3కి సంబంధించింది. ఇందుకోసం మరో నలభై రోజులు శంకర్ కేటాయిస్తున్నారట.

ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తోంది. శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జే.సూర్య, సునీల్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు దీన్ని నిర్మిస్తున్నారు.

కాగా కమల్ సినిమా తరువాతే రామ్ చరణ్ సినిమా రిలీజ్ చేయనున్నారని . ఇప్పుడు ఇండియన్ 2 ని 2024 సమ్మర్‌కి, ఇండియన్ 3ని క్రిస్టమస్ కి సిద్ధం చేస్తున్నారట శంకర్. దీనిబట్టి చూస్తే.. గేమ్ ఛేంజర్ 2025లో ఆడియన్స్ ముందుకు రాబోతుందని అభిమానులు తెగ గాబరా పడుతున్నారు. దీంతో ఈ రిలీజ్ విషయం, సాంగ్ పోస్టుపోన్ విషయం గురించి ఫ్యాన్స్ దర్శకనిర్మాతలను ప్రశ్నిస్తూ పోస్టులు వేస్తున్నారు.

 

Exit mobile version