Hi Nanna Trailer : నాచురల్ స్టార్ నాని ఊరమాస్ అండ్ రగ్గడ్ లుక్స్ ఇటీవలే విడుదలయ్యి భారీ హిట్ కొట్టిన సినిమా దసరా. కాగా ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ విజయంతో నాని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అయితే ప్రస్తుతం నాని తన 30వ సినిమాను తెరకెక్కిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో నాని మరోసారి నాన్నగా కనిపించబోతున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఈ మూవీ రాబోతుంది . ఈ మూవీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రుతి హాసన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.
హీరో నాని దసరా లాంటి మాస్ మూవీ తరువాత తన 30వ సినిమా గా హాయ్ నాన్న లాంటి ఫాథర్ సెంటిమెంట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు . ఇక ఈ సినిమా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో పాటు నాని, మృణాల్ మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయని ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ తో తెలిసిపోతుంది.హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రెండు పాటలు, టీజర్ రిలీజ్ చేసి సినిమాపై మంచి క్లాసిక్ హైప్ ఇచ్చారు. తాజాగా నేడు హాయ్ నాన్న ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ లో నాని, తన కూతురు జీవితం సంతోషంగా గడిపేస్తుండగా వారి లైఫ్ లోకి మృణాల్ వచ్చినట్టు, నాని కూతురు అమ్మ గురించి ప్రతిసారి అడగడం, నాని భార్యగా శృతిహాసన్ ఏమైంది, నాని లైఫ్ లో మృణాల్ ఉంటుందా అన్నట్టు ప్రేమ, ఎమోషన్ అంశాలతో చూపించారు.ట్రైలర్ లో వచ్చిన ప్రతి డైలాగ్ అన్నీ ఎమోషన్స్ ని కళ్ళకు కట్టినట్టు చూపింది . దీంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.ఈ సినిమాపై కూడా నాని అభిమానులకు అంచనాలు పెరిగిపోయాయి . మరి మళ్ళీ నాని బ్లాక్ బాస్టర్ కోడతాడో లేదో చూడాలి .