Site icon Prime9

Dhootha Trailer :నాగ చైతన్య “దూత” వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్..

details-about-naga-chaitanya-dhootha-trailer

details-about-naga-chaitanya-dhootha-trailer

Dhootha Trailer : టాలీవుడ్ స్టార్ నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు . అయితే హీరో లు వారి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే ఇటీవల స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బాటలో అక్కినేని నాగ చైతన్య కూడా డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ చేశారు. మర్డర్స్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ ఉండబోతుంది.అయితే చైతూ ఇప్పటి వరకు ఇలాంటి జోనర్ ని ట్రై చెయ్యలేదు. మొదటిసారి ఈ జోనర్ లో చేస్తుండటంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా దూత సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సస్పెన్స్ గా ఉంది. ఇందులో నాగ చైతన్య ఒక జర్నలిస్ట్ గా కనపడబోతున్నట్టు, ఒక దినపత్రికని స్థాపించబోతున్నట్టు, అతనికి గతం తాలూకు ఏవో వెంటాడుతున్నట్టు, అనుకోకుండా అతని చుట్టూ హత్యలు, వాటిల్లో అతను ఇరుక్కుంటున్నట్టు చూపించారు . మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్ గా సాగబోతుందని తెలుస్తుంది.

ఇటీవలే దూత్ వెబ్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక దూత సిరీస్ లో ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయో తెలియాల్సి ఉంది. నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి జంటగా ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకే తాజాగా తండేల్ అనే టైటిల్ ని ప్రకటించారు . 2018లో గుజరాత్ నుండి 21 మంది మత్స్యకారులు వేటకెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్‌ చెరలో చిక్కుకోగా అందులో ఉన్న ఓ ఆంద్ర మత్స్యకారుడు కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు ఇటీవల నిర్మాతలు తెలిపారు. ఇక ఈ సినిమాలో నాగ్ చైతన్య సిక్స్ ప్యాక్ కూడా చూపించబోతున్నట్టు సమాచారం.

Exit mobile version