Site icon Prime9

Deepika Padukone: ‘డు యూ నో నాటు?’.. అంటూ పాటను పరిచయం చేసిన దీపికా

Deepika Padukone

Deepika Padukone

Deepika Padukone: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ తెలుగు పాట ‘నాటు నాటు’ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారాన్ని అందుకుంది. దీంతో లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ‘నాటు నాటు’ పాట దుమ్ములేపింది.

 

నాటు నాటును పరిచయం చేసిన దీపికా

నాటు నాటుకు ఆస్కార్ ప్రకటించే ముందు ఈ పాటను బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె పరిచయం చేశారు. అనంతరం సింగర్స్ రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ లైవ్‌లో పాట పాడారు.

ఈ సందర్భంగా పాట నేపథ్యం గురించి అవార్డుల వేడుకకు హాజరైన వారికి దీపిక స్పెషల్ గా వివరించడం విశేషం.

‘తిరుగులేని సింగర్స్.. ఉర్రూతలూగించే బీట్స్‌.. అదరహో అనిపించిన స్టెప్పులు ఈ పాటను ప్రపంచ సంచలనంగా మార్చాయి.

విప్లవకారులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ మధ్య గొప్ప స్నేహాన్ని చాటి చెప్పింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.

ఈ సినిమాలోని కీలక సన్నివేశంలో వచ్చే పాట ఇది. దీన్ని తెలుగులో పాడటంతో పాటు వలసవాద వ్యతిరేక ఇతివృత్తాన్ని సజీవంగా ప్రదర్శించడంతో ఇది సంచలనం సృష్టించింది.

యూట్యూబ్‌, టిక్‌టాక్‌లలో కోట్లాది వీక్షణలను సొంతం చేసుకుంది.

అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో థియేటర్లలో ప్రేక్షకులతో స్టెప్పులు వేయించింది. అంతేనా.. భారత సినీ ఇండస్ట్రీ నుంచి ఆస్కార్‌కు నామినేట్‌ అయిన తొలి పాటగా హిస్టరీ లో కెక్కింది.

‘డు యూ నో నాటు?’ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో ‘నాటు నాటు’ ఇదే..’ అంటూ దీపిక ఈ పాటను పరిచయం చేశారు.

దీంతో అక్కడున్నవారంతా చప్పట్లతో నాటు నాటు పాటకు ఘన స్వాగతం పలికారు.

 

 

అరుదైన ఘనత

దీపిక పడుకొణె నాటు నాటు ను పరిచయం చేసిన తర్వాత సింగర్స్ కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ లైవ్‌లో పాట పాడారు.

ఈ పాటకు వెస్ట్రన్‌ డ్యాన్సర్లు తమ డ్యాన్స్‌తో అలరించారు. ఈ పాటను ప్రదర్శించేటపుడు ఆస్కార్‌ వేడుకకు వేదికైన డాల్బీ థియేటర్‌ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది.

డాన్స్ పూర్తి అవ్వగానే అక్కడున్న అతిథులు మొత్తం లేచి నిల్చుని అభినందించారు.

 

ప్రత్యేక ఆకర్షణగా దీపికా((Deepika Padukone)

ఆస్కార్‌లో దీపిక ‘నాటు నాటు’ను పరిచయం చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రతి భారతీయుడు గర్వపడే క్షణాలివి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వేడుకలో దీపిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ప్రముఖ డిజైనర్‌ లూయిస్‌ విట్టన్‌ రూపొందించిన బ్లాక్ క్లాసిక్‌ గౌను ధరించించింది దీపికా.

మెడలో కార్టియర్‌ నెక్‌పీస్‌లో స్టయిలిష్ గా, హుందాగా కన్పించింది. ఆ ఫొటోలను దీపిక ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌ అయ్యాయి.

 

Exit mobile version