Site icon Prime9

Dasara Movie: ‘దసరా’ చూసిన అల్లు అర్జున్.. ఏమన్నారంటే..

Dasara Movie

Dasara Movie

Dasara Movie: నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేశ్ తో కలిసి నటించిన చిత్రం ‘దసరా’. ఇటీవలే విడుదలైన చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. సింగరేణి నేపథ్యంలో తెరకిక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో నాని, కీర్తి సురేశ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అనేక మంది సినీ ప్రముఖులు దసరా సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ దసరా సినిమా చూసి.. చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశాడు.

 

ప్రతి సీనూ అద్భుతం(Dasara Movie)

‘దసరా’ టీమ్‌ మొత్తానికి నా అభినందనలు. చాలా అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. నాని, కీర్తిసురేశ్‌ అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వారి నటకు ఫిదా అయిపోయా. సంతోష్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సత్యన్‌ కెమెరా వర్క్ బాగున్నాయి. కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ శ్రీకాంత్‌ ఓదెల తన పనితనంతో అరంగ్రేటంలోనే అదరగొట్టేశారు. ప్రతి సీన్‌నూ ఆయన అద్భుతంగా చిత్రీకరించారు. చిత్ర యూనిట్ మొత్తం చాలా బాగా చేశారు. వేసవిలో వచ్చిన నిజమైన ‘దసరా’ అని బన్నీ పేర్కొన్నారు.

కాగా, మార్చి 30న విడుదలైన దసరా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. రూ. 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. విడుదలైన కొన్నిరోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టినట్టు సినీ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.

 

 

చిరంజీవి సైతం..(Dasara Movie)

అదే విధంగా గత వారం మెగాస్టార్‌ చిరంజీవి ‘దసరా’ టీమ్‌ ను అభినందించిన విషయం తెలిసిందే. నాని, కీర్తి సురేశ్‌ల నటనతో పాటు శ్రీకాంత్‌ ఓదెల మేకింగ్‌ చాలా బాగుందని తెలిపారు. ‘డియర్‌ నాని.. ‘దసరా’ సినిమా చూశాను. చాగా గొప్ప చిత్రమిది. నీ నటన చాలా అద్భుతంగా ఉంది. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల పనితీరు చాలా బాగుంది. అసలు ఇది శ్రీకాంత్‌ ఓదెలకు తొలి సినిమా అని తెలిసి ఆశ్చర్యపోయాను. చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. మా మహానటి కీర్తి సురేశ్‌ యాక్టింగ్‌ అదిరిపోయింది. దీక్షిత్‌ శెట్టి కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం ఆకట్టుకుంది. మొత్తంగా టీమ్ అంతా కలిసి గొప్ప చిత్రాన్ని ఇచ్చారు’ అని చిరంజీవి మెచ్చుకున్నారు.

 

Exit mobile version