Site icon Prime9

Daggubati Rana : షారుఖ్, హృతిక్ రోషన్ లపై షాకింగ్ కామెంట్స్ చేసిన రానా.. ఏమన్నాడంటే ??

daggubati rana shocking comments on sharukh khan and hrithik roshan

daggubati rana shocking comments on sharukh khan and hrithik roshan

Daggubati Rana : యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ వైవిధ్యానికి ముందు అడుగు వేస్తూ ఉంటాడు.ఇటీవల తన బాబాయ్, విక్టరీ వెంకటేష్ తో కలిసి ” రానా నాయుడు ” అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. అయితే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా అభిమానులకు చేరువయ్యాడు (Daggubati Rana) రానా. ఈ మేరకు తాజాగా ఓ ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఛానల్ నిర్వహించిన ప్రోగ్రాంలో పాల్గొన్నారు.

కేవలం నటుడు గానే కాదు, లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు వారసత్వాన్ని అందుకున్న రానా.. నిర్మాతగా కూడా సినిమాల తెరకెక్కిస్తున్నాడు. కాగా రానా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో రానా చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంటున్న మార్పులు గురించి మాట్లాడాడు. అయితే ఈ తరుణంలోనే బాలీవుడ్ స్టార్ హీరోలైన షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం వివాదాస్పదంగా మారింది.

ఆ ఇంటర్వ్యూ లో రానా మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో బాహుబలి ఓ అద్భుతం. ఆ చిత్రం తరువాత సినిమా చూసే విధానం మారింది. ఎప్పటికప్పుడు ప్రేక్షకుడు ఒక కొత్తదనాన్ని కోరుకుంటాడు. దానికి తగట్టు సినిమా రంగంలో మార్పులు రావాలి. ప్రతి ఒక్కరిలో ఓ ప్రత్యేకతని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కొత్తగా వచ్చే వారిలో మరో షారుక్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ ని చూడాలని వాళ్లు అనుకోవడం లేదు. ఎందుకంటే హృతిక్ అండ్ షారుఖ్ ని వాళ్ళు ఆల్రెడీ చూసేశారు. మనం ఏంటనేదే వాళ్లు చూస్తున్నారు అంటూ రానా చెప్పుకొచ్చాడు.

అలాగే నిర్మాతగా తన కెరీర్ గురించి చెబుతూ.. ‘బొమ్మలాట’ అనే ఒక చిన్న చిత్రం చేయగా.. మొదటి సినిమా తోనే రెండు నేషనల్ అవార్డ్స్ ని అందుకున్నాడు. అయితే ఒక చిన్న సినిమా విడుదల కావాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుంది. అందుకనే తాను చిన్న చిత్రాలను నిర్మించాలని, ఇండస్ట్రీకి వద్దాం అనుకునే కొత్త టాలెంట్ కి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల రానా పరేషాన్ అనే సినిమాని కూడా నిర్మించిన రానా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.

 

Exit mobile version