Sonakshi-Zaheer Marriage:బాలీవుడ్‌లో మరో జంట ఒక్కటి కాబోతోంది. ఈ నెల 23న ముంబైలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా.. జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోబోతున్నారు. అప్పుడే సెలెబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి.అయితే సోనాక్షికి జహీర్‌కు మధ్య రిలేషన్ షిప్ ఎప్పుడు మొదలైంది. మొదటిసారి వారు బహిరంగంగా ప్రజల ముందుకు ఎప్పుడొచ్చింది ఒక లుక్కేద్దాం.
హీరామండి .. ది డైమండ్ బజార్ సినిమా విజయవంతం కావడంతో సోనాక్షి సిన్హా వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్నాయి. కాగా ఈ నెల 23న సోనాక్షి తన చిరకాల మిత్రుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటికే వారి వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజా పరిణామాలను బట్టి చూస్తే త్వరలోనే బాలీవుడ్‌లో మరో బిగ్ వెడ్డింగ్ కౌంట్ డౌన్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక సోనాక్షి.. జహీర్ రిలేషన్ షిప్ టైమ్ లైన్‌పై ఓ లుక్కేద్దాం.
ఏడు సంవత్సరాలుగా డేటింగ్..(Sonakshi-Zaheer Marriage)
వీరిద్దరి మొదటి మీటింగ్ విషయానికి వస్తే సోనాక్షి.. జహీర్‌లు గత ఏడు సంవత్సరాల నుంచి డేటింగ్ చేస్తున్నారు. అయితే మొదటిసారి వీరు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇచ్చిన పార్టీలో కలుసుకున్నట్లు సమాచారం. ముందుగా ఫ్రెండ్‌షిప్ తర్వాత రొమాన్స్… ప్రస్తుతం ఈ రొమాన్స్ కాస్తా పెళ్లి వరకు వెళ్లింది. ఆయూష్ శర్మ… అర్పితా ఖాన్‌ల ఈద్ పార్టీ 2023 తర్వాత నుంచి వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున గాసిప్స్ మొదలయ్యాయి.
అయితే వీరి రొమాన్స్ ఏదో చాలుమాటు వ్యవహారం కాదు.. బహిరంగంగానే పలు ఈవెంట్స్‌లో తారసపడ్డారు. సల్మాన్ సిస్టర్ ఈడీ సెలెబ్రేషన్స్ నుంచి హుమా ఖరేషి బర్త్‌డే బాష్ వరకు.. షర్మిన్ షెహగల్ వెడ్డింగ్ రిసెప్షన్ వరకు ఈ జంట అందరి కంట పడింది. ఫోటోగ్రాఫర్లకు ఫోజులు కూడా ఇచ్చారు. సోనాక్షి – జహీర్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో తమకు ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో వ్యక్తం చేసుకున్నారు. తమ రొమాంటిక్ పిక్చర్స్‌ను షేర్ చేశారు. రోజు రోజుకు తమ మధ్య బంధం మరింత బలపడుతోందని సోనాక్షి చెప్పుకొచ్చారు. కొత్త జంటకు అడ్వాన్స్ గ్రీటింగ్ చెప్పేదామా మరి!!!