Site icon Prime9

Thangalaan Movie : చియాన్ విక్రమ్ “తంగలాన్” టీజర్ రిలీజ్.. అరాచకానికి కేరాఫ్ అడ్రస్ లాగా !

chiyaan vikram Thangalaan Movie teaser released

chiyaan vikram Thangalaan Movie teaser released

Thangalaan Movie : తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. తన పాత్ర కోసం ఎలాంటి సాహసాలైన చేస్తుంటారు విక్రమ్. ప్రతి సినిమాలో తన పాత్ర కోసం.. ఆయన ఎంత కష్టపడతారో అందరికి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద అతడి సినిమాలు ఫెయిల్ అయినా.. అతడి నటన మాత్రం గుర్తుండిపోతుంది. ఇక ఇటీవలే విక్రమ్ నటించిన పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ అయ్యి మంచి హిట్ సాధించింది. ఆ తర్వాత పా రంజిత్ దర్శకత్వంలో “తంగలాన్” అనే సినిమా చేస్తున్నాడు.

స్టూడియో గ్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ హైప్ ఉంది. విక్రమ్ కెరీర్ లోనే మోస్ట్ హైప్డ్ మూవీగా వస్తున్న దీని కోసం విక్రమ్ ఏకంగా 20 కేజీల బరువు తగ్గారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో.. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా అప్డేట్ కోసం ఫాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ తాజాగా మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు.

నిమిషమున్నర నిడివితో ఉన్న ఈ టీజర్ లోని ప్రతి ఫ్రేమ్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. యుగానికి ఒకడు, మరుదనాయగం సినిమాలు గుర్తు చేసే రేంజులో తంగలాన్ సెటప్ ఉంది. విక్రమ్ గెటప్, ఆర్టిస్టుల లుక్ ఇంతక ముందెప్పుడూ చూడని విధంగా ఉన్నాయి. ముఖ్యంగా విక్రమ్ అయితే క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసినట్లు ఉన్నాడు. టీజర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. టీజర్ లో విక్రమ్, పాముని చేత్తోనే ముక్కలు చేసే సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సింపుల్ గా చెప్పాలి అంటే తంగలాన్ టీజర్ చూడగానే విక్రమ్ ఖాతాలో మరో నేషనల్ అవార్డ్ గ్యారెంటీ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.

YouTube video player

Exit mobile version
Skip to toolbar