Site icon Prime9

Boyapati Sreenu : బోయపాటి శ్రీను బర్త్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన రామ్ పోతినేని.. ఏకంగా 80 కేజీల కేకుతో

boyapati sreenu birthday celebrations photos goes viral

boyapati sreenu birthday celebrations photos goes viral

Boyapati Sreenu : తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బి.గోపాల్, వి.వి.వినాయక్ ల తర్వాత మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన దర్శకుడు బోయపాటి. రవితేజ హీరోగా చేసిన ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు బోయపాటి శ్రీను. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో దర్శకుడిగా ఇంక ఆయన వెనుదిరిగి చూసుకోలేదు అని చెప్పాలి. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సరైనోడు’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో తెరకెక్కించిన ‘జయ జానకి నాయక’ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇక బాలకృష్ణతో సింహా, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్ హాట్రిక్ సినిమాలతో రికార్డు క్రియేట్ చేసారు. ఇటీవల వచ్చిన అఖండ సినిమాతో బోయపాటికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఇక ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో ప్రస్తుతం బోయపాటి శ్రీను ఒక సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మూవీలో శ్రీలీల, సాయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ చిత్రం రిలీజ్ చేస్తారని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఊర మాస్ గా ఈ సినిమా ఉండబోతుందని సినీ వర్గాల్లో టాపిక్ నడుస్తుంది. అయితే బుధవారం నాడు దర్శకుడు బోయపాటి శ్రీను పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే.

ఆయన బర్త్ డే ని పురస్కరించుకొని పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ మేరకు హీరో రామ్ బోయపాటి శ్రీను పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేశారని తెలుస్తుంది. ఈ సెలబ్రేషన్స్ కి హీరో రామ్ ప్రత్యేకంగా బోయపాటి కోసం ఏకంగా 80 కేజీల కేక్ ని తెప్పించి కట్ చేయించడం వైరల్ గా మారింది. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో చిత్రయూనిట్ అంతా పాల్గొనగా.. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వేడుకలు సినిమా షూటింగ్ సెట్ లోనే జరిగినట్లయిగా భావిస్తుండగా.. శ్రీ లీల కూడా ఈ ఫొటోల్లో ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేయనుంది.

 

 

రామ్ చివరిగా లింగుస్వామి దర్శకత్వంలో వారియర్ అనే సినిమా చేశాడు. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కెరీర్ లో మొదటి సారి పోలీస్ పాత్రలో నటించాడు రామ్. కృతి శెట్టి హీరోయిన్ గా చేసిన ఈ మూవీలో ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. ఈ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ విలన్ గా ఆది పినిశెట్టికి సరైనోడు తర్వాత ఆ రేంజ్ లో మంచి పేరు అయితే దక్కిందని చెప్పాలి. దీంతో రామ్ ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నట్లు భావిస్తున్నారు. అఖండ తో ఫుల్ సక్సెస్ మోడ్ లో ఉన్న బోయపాటి.. రామ్ కి మంచి హిట్ ఇస్తాడని ఆయన ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

 

Exit mobile version