Site icon Prime9

Saif Ali Khan: నేను తాగి వస్తున్నానని నాతో పనిచేయడానికి ఇష్టపడలేదు.. సైఫ్ అలీఖాన్

Bollywood: సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లో ప్రతిభావంతులైన నటులలో ఒకరు. అయితే, ఒకప్పుడు అతను సినిమా సెట్‌కి తాగి వస్తాడనే పుకార్లు వ్యాపించాయి. ఇది అతని ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా చాలా ప్రాజెక్ట్‌లను అతనికి దూరం చేసింది.

ఒక న్యూస్ పోర్టల్‌కి ఇచ్చిన త్రోబాక్ ఇంటర్వ్యూలో, సైఫ్ రాహుల్ రావైల్ యొక్క ‘బేఖుడి’ సమయంలో పరిస్దితిని వివరించాడు. ఈ సినిమా చేయడానికి తనకు ఆసక్తి లేదని దర్శకుడు అపోహలో ఉండేవాడని తెలిపాడు. తాను తాగి సెట్స్‌కి వస్తున్నానని సెట్స్‌లోనే నిద్రపోతున్నానని అనేక పుకార్లు కూడా మొదలయ్యాయి. దీనితో తనతో పనిచేయడానికి ఎవరూ ఇష్టపడలేదని సైఫ్ చెప్పాడు. అతడిని ‘బేఖుడి’ నుండి కూడా తొలగించారు.

సైఫ్ త్వరలో హృతిక్ రోషన్‌తో కలిసి ‘విక్రమ్ వేద’లో కనిపించనున్నాడు. అతని రాబోయే చిత్రాల్లో ‘ఆదిపురుష్’ కూడా ఉంది, ఇందులో ప్రభాస్, కృతి సనన్ మరియు సన్నీ సింగ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version