Site icon Prime9

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ది ఆత్మహత్య కాదు హత్యే.. మార్చురీ ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు

Sushant Singh Rajput

Sushant Singh Rajput

Sushant Singh Rajput: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. రెండేళ్లు కావస్తున్నా అతని ఆత్మహత్యకు సంబంధించిన మిస్టరీ వీడలేదు. దర్యాప్తు మరణాన్ని ‘ఆత్మహత్య’గా పేర్కొనగా, అభిమానులు మరియు కుటుంబ సభ్యులు మాత్రం దీనివెనుక తమకు అనుమానాలు ఉన్నాయని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా సుశాంత్ సింగ్ శవపరీక్షను చూసిన ఒక వ్యక్తి అతను ఆత్మహత్య చేసుకోలేదని హత్యచేయబడ్డాడని చెప్పడం సంచలనం కలిగించింది.

సుశాంత్ ఆత్మహత్యపై కపూర్ హాస్పిటల్‌లోని మార్చురీ ఉద్యోగి రూప్ కుమార్ షా షాకింగ్ వ్యాఖ్యలు చేసాడు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేశారని రూపకుమార్ షా చెప్పారు. సుశాంత్ మృతదేహం ఆసుపత్రికి చేరుకోగా, అతని శరీరంపై గాయాలు ఉన్నాయి.మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఇది ఆత్మహత్య కేసు కాదని, హత్య కేసు అని డాక్టర్‌కి చెప్పాను. కానీ వైద్యులు పట్టించుకోలేదని షా చెప్పారు.షా గత నెలన్నర క్రితం పదవీ విరమణ చేశారు. పని చేస్తున్నప్పుడు ఇబ్బంది రాకూడదనే తాను చాలా కాలం మౌనంగా ఉన్నానని షా అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పుడు, కూపర్ ఆసుపత్రికి ఐదు మృతదేహాలు పోస్ట్‌మార్టం కోసం వచ్చాయి. ఆ ఐదు మృతదేహాలలో ఒకటి వీఐపీ బాడీ. తరువాత అతను సుశాంత్ అని తెలిసింది.అతని శరీరంపై అనేక దెబ్బలు ఉన్నాయి. అతని మెడపై రెండు నుండి మూడు గుర్తులు కూడా ఉన్నాయని మాకు తెలిసింది. పోస్ట్‌మార్టం రికార్డ్ చేయాల్సి ఉంది, అయితే మృతదేహం యొక్క ఫోటోలను మాత్రమే తీయమని ఉన్నతాధికారులు చెప్పారు. అందుకే, నేను వారి ఆజ్ఞ ప్రకారమే చేశాను. నేను సుశాంత్ మృతదేహాన్ని మొదటిసారి చూసినప్పుడు, ఇది ఆత్మహత్య కాదు, హత్య అని నేను త్వరగా నా సీనియర్‌లకు తెలియజేసాను. నిబంధనల ప్రకారం పని చేయాలని వారికి కూడా చెప్పాను. అయితే, వీలైనంత త్వరగా ఫోటోలు తీసి మృతదేహాన్ని పోలీసులకు ఇవ్వాలని నా సీనియర్లు నాకు చెప్పారు. అందుకే రాత్రిపూట పోస్టుమార్టం చేశాం అని రూప్‌కుమార్ షా చెప్పారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై ముంబై పోలీసులతో ప్రారంభించి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మరియు నార్కోటిక్స్ షాపింగ్ మోడ్ కంట్రోల్ బ్యూరో (NCB) వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టాయి. అనంతరం ఆయన మృతిని అధికారులు ఆత్మహత్యగా నిర్ధారించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కెకె సింగ్, ఇటీవల ఒక టీవీ న్యూస్ ఇంటర్వ్యూలో, తన కొడుకు మరణంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే యొక్క ప్రమేయం ఉందని ఆరోపించారు.

Exit mobile version