Site icon Prime9

Bollywood: బాలీవుడ్ లో “పఠాన్” సరికొత్త రికార్డులు

Pathaan-teaser creates a new record in bollywood

Pathaan-teaser creates a new record in bollywood

Bollywood: బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిన కూడా ఈయనకు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అయితే ఈ బాలీవుడ్ బాద్ షా నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళయింది. ఈయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం షారూఖ్ ఖాన్, సిద్ధార్థ్‌ ఆనంద్ దర్శకత్వంలో ‘పఠాన్‌’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది.

ఇప్పటికే చిత్రం నుండి విడుదలయిన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా ఈ సినిమా టీజర్ తాజాగా అరుదైన రికార్డు క్రియేట్‌ చేసింది.
బాలీవుడ్ లో అత్యధిక లైక్స్ సాధించిన టీజర్‌గా పఠాన్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా టీజర్‌కు 17లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. షారుఖ్ సినిమా వచ్చి నాలుగేళ్లయినా ఈయన క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమాలో షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే నటించింది. జాన్‌ అబ్రహం కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను జనవరి 25 పాన్‌ ఇండియా లెవల్లో రిలీజ్‌ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: హన్సిక పెళ్లిలో ప్రత్యేక అతిథులెవరో తెలుసా.. నెట్టింట వీడియో వైరల్

Exit mobile version