Site icon Prime9

Mirzapur Actor: బాలీవుడ్ లో తీవ్ర విషాదం.. మీర్జాపూర్‌ నటుడు కన్నుమూత!

jitendra shastri mirzapur

jitendra shastri mirzapur

Mirzapur Jeetendra Shastri: బాలీవుడ్ లో తీవ్ర విషాదం,  ప్రముఖ సీనియర్‌ హిందీ నటుడు జితేంద్ర శాస్త్రి  శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.  అయితే, ఆయన మరణానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. జితేంద్ర మరణంపై అతడి తోటి నటులు సోషల్ మీడియాలో  పెట్టిన పోస్టులతో వార్త బయటకి వచ్చింది. నటుడు జితేంద్ర శాస్త్రి ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌, రాజ్మా చావ్లా, బ్లాక్‌ ఫ్రైడే, మూవీస్ లో తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ఓటీటీలో బ్లాక్ బస్టర్ మీర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌లో ఉస్మాన్‌ అనే పాత్రలో జితేంద్ర నటించారు.  ఈయన కేవలం చిత్ర  పరిశ్రమకే  కాకుండా నాటక ప్రపంచానికి కూడా తెలిసిన వాళ్ళే. ప్రసిద్ధి చెందిన ఎన్నో నాటకాల్లో జితేంద్ర యాక్ట్ చేసారు. ఇక, జితేంద్ర మృతిపై ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ మిశ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ చేస్తూ.. ‘‘ నువ్వు లోకంలో లేవు, కానీ నా మనసు మరియు హృదయ జాలంలో ఎప్పుడూ ఉంటావు 😔🙏 ఓం శాంతి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

జితేంద్ర మృతి పై మరో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రాజేష్‌ తైలాంగ్‌ ట్విటర్‌ ద్వారా పోస్ట్ చేస్తూ… ‘‘ జితేంద్ర సోదరుడు లేడంటే జీర్ణించుకో లేకపోతున్నాము. ఆయన ఎంతో అద్భుతమైన నటుడు, ఎంతో మంచి మనిషి, తన హ్యూమర్‌తో చుట్టూ పక్కన ఉన్న అందరిని బాగా నవ్విస్తూ ఉంటారు. నాకు ఆయనతో పనిచేసే ఛాన్స్ వచ్చింది. అది నా అదృష్టం’’ అని తెలిపారు.

 

Read this Also : Katragadda Murari: నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత

 

Exit mobile version