Site icon Prime9

Jahnvi Kapoor: దిల్ చీజ్ క్యా హై అంటున్న జాన్వి

Janhvi Kapoor dance to rekha's hit song prime9 news

Janhvi Kapoor dance to rekha's hit song prime9 news

Bollywood: బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉండడం కనిపిస్తుంది. తన అప్డేట్ అన్నీ అభిమానలతో నెట్టింట పంచుకుంటారు. అయితే ఇప్పుడు ఇందంతా ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా, ఇన్ స్టా వేదికగా జాన్వి చేసిన డ్యాన్స్ ఇప్పుడు కుర్రకారులో జోరుపుట్టిస్తుంది.

జాన్వికపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వరుస ఫోటోలు మరియు వీడియోలను ఇటీవలె షేర్ చేసింది. అందులో ఒక వీడియోలో నటి రేఖ యొక్క 1981 హిట్ చిత్రం ఉమ్రావ్ జాన్ మూవీలోని పాట అయిన “దిల్ చీజ్ క్యా హై”కి జాన్వి తన స్నేహితుడితో కలిసి స్టెప్పులేసింది. దీనిని అభిమానులు తెగ లైక్ చేస్తున్నారు. నటి రేఖకు ఏమాత్రం తీసిపోకుండా అద్భుతంగా నృత్యం చేశావ్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version