Site icon Prime9

Ira Khan: సీక్రెట్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అమీర్ ఖాన్ కూతురు

amir khan 2 prime9news

amir khan 2 prime9news

Bollywood: అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని అందరిని షాక్ గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నుపుర్ శిఖారే కొత్త స్టైల్లో రింగ్ తొడిగి ఐరా ఖాన్ కు ప్రపోజ్ చేశాడు. ఐరా కూడా వెంటనే తన ప్రపోజ్ ను అంగీకరించింది. ఇద్దరూ ఒకరికొకరు ప్రేమను వ్యక్తం చేస్తూ, ముద్దు కూడా పెట్టుకున్నారు. ఈ ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ అయిన సందర్భంగా సినీ సెలబ్రిటీలు ఐరాకు వెడ్డింగ్ శుభాకాంక్షలు తెలిపారు.

ఐరా ఖాన్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఐరా ఖాన్, నుపుర్ శిఖారే 2020 నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వీరిద్దరు వారి ఫొటోలను షేర్ చేసుకున్నారు. ఐరా ఖాన్ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ పై కృష్ణ ష్రాఫ్, రియా చక్రవర్తి, సారా టెండూల్కర్, ఫాతిమా సనా షేక్ కపుల్ స్పందించారు. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ పెట్టారు. ఆ ఫోటోలను చూసిన అభిమానులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఐరా ఖాన్, నుపుర్ శిఖారే కొత్త జీవితం మంచిగా సాగాలని అందరూ ఆశీర్వదిస్తున్నారు.

Exit mobile version