Site icon Prime9

Aashiqui 3 Movie: “ఆషికి 3” సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న..!

Aashiqui 3 movie updates

Aashiqui 3 movie updates

Aashiqui 3 Movie: “ఆషికి” సినిమా అంటే తెలియని కుర్రకారు ఉండరు. అటు బాలీవుడ్ మరియు ఇటు టాలీవుడ్లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ చిత్రం. ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన “ఆషికి” రెండు సిరీస్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టాయి. ఈ నేపథ్యంలోనే  “ఆషికి 3” చిత్రం కూడా చెయ్యబోతున్నారు. కార్తిక్ ఆర్య‌న్ ఈ మూవీలో హీరోగా న‌టిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ గా దక్షిణాది స్టార్ బ్యూటీ ర‌ష్మిక‌ మందన్నను ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తుంది.

బాలీవుడ్ ప్రేమ క‌థ‌ల్లో “ఆషికి” చిత్రానికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. 1990లో విడుద‌లైన “ఆషికి” చిత్రం దేశంలో సెన్సేష‌న్ క్రియేట్ చేసిందనడంలో అతిశయోక్తి లేదు. కేవ‌లం 30ల‌క్ష‌ల్లో తెర‌కెక్కిన ఈ చిత్రం దాదాపు 5 కోట్ల క‌లెక్ష‌న్ల‌ను రాబట్టి రికార్డు సృష్టించింది.
ఇక ఈ సినిమా పాట‌లైతే అప్ప‌ట్లో ఒక ఊపు ఊపేశాయనుకోండి. అలియా భ‌ట్ తండ్రి మ‌హేష్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని టీ సిరీస్ సంస్థ తెరకెక్కించింది. కాగా దాదాపు 23ఏళ్ళ త‌ర్వాత అదే నిర్మాణ సంస్థ‌లో ‘ఆషికి-2’ప్రేక్షకుల ముందు విడుదలయ్యింది. ఇంక ఈ సినిమా 100కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే “ఆషికి 3” చిత్రం తెరకెక్క‌నున్న‌ట్లు అఫిషియ‌ల్‌గా ప్ర‌క‌ట‌న వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

ఈ చిత్రంలో కార్తిక్ ఆర్య‌న్ హీరోగా న‌టిస్తున్నాడు. దీనికి సంబంధించి ఇటీవ‌లే విడుద‌లైన గ్లింప్స్‌కు ప్రేక్ష‌కుల నుండి స్పంద‌న లభించింది. కాగా ఈ సినిమాకు మ‌ర్డ‌ర్ ఫేం ఆనురాగ్ బ‌సు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌లే కార్తిక్ ఆర్య‌న్‌తో ఓ యాడ్ షూట్ చేసిన ర‌ష్మిక‌ మందన్నను హీరోయిన్‌గా ఎంపిక చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌నే వార్త హిందీ పరిశ్రమనాట చక్కర్లు కొడుతుంది. మరి దీనిలో నిజ‌మెంతుందో తెలియాలంటే మేక‌ర్స్ నుండి అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సిందే. అయితే ఈ చిత్రానికి ప్రీత‌మ్ సంగీత ద‌ర్శ‌కుడి వ్యవహరిస్తుండగా.. టీ సిరీస్‌- విశేష్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇదీ చదవండి: Prabhas: ఆదిపురుష్ హీరోయిన్ తో ప్రభాస్ డేటింగ్..?

Exit mobile version