Site icon Prime9

Salman Khan: బాలీవుడ్ కండలవీరుడికి డెంగీ జ్వరం.. సినిమాలకు షోలకు బ్రేక్

salmankhan diagnosed-with-dengueprime9news

salmankhan diagnosed-with-dengueprime9news

Salman Khan: బాలీవుడ్ కండలవీరుడు, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయగల నటుడు సల్మాన్ ఖాన్ ఇటీవల అస్వస్థతకు లోనయ్యాడు. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సల్లూభాయ్ పరీక్షలు చేయించుకోగా డెంగీ అని తేలింది. దానితో ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఆయనను రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఫలితంగా ఈ భాయ్‌జాన్ బాలీవుడ్ సెలబ్రిటీలు హోస్ట్ చేస్తున్న దీపావళి స్పెషల్ పార్టీలోను కనిపించడం లేదు. అలాగే బిగ్‌బాస్ రియాలిటీ షోకు కూడా హోస్ట్ చేయడం లేదు. ప్రస్తుతం నటిస్తున్న సినిమా షూటింగ్‌లన్నింటీ వాయిదా వేసి కొద్దిరోజులు సల్లూ భాయ్ వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నాడు. కాగా కండలవీరుడు కోలుకుంటున్నట్టు అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

సల్మాన్ ఖాన్ అటు సినిమాలతో పాటు ఇటు బిగ్‌బాస్ రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈయన డెంగీ బారిన పడటంతో ఈ షోకు కొద్దిరోజుల పాటు బ్రేక్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సల్లూభాయ్ స్థానంలో ఈ రియాలిటీ షోను కరణ్ జోహార్ హోస్ట్ చేయబోతున్నాడు.

ఇదీ చదవండి: జపనీస్ భాషలో ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. వీడియో వైరల్

Exit mobile version