Rohit Shetty: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రోహిత్ శెట్టికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ శివార్లలో జరుగుతున్న షూటింగ్ లో ఆయన ప్రమాదానికి గురయ్యారు. దీంతో చిత్ర యూనిట్ రోహిత్ శెట్టిని వెంటనే ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
రోహిత్ శెట్టి(Rohit Shetty) కి బలమైన గాయాలు తగిలినట్లు తెలుస్తోంది.
గాయాన్ని గుర్తించి డాక్టర్లు వెంటనే ఆయనకు సర్జరీ చేశారని సమాచారం.
ఓ కారు ఛేజింగ్ సీన్‌ను తెరకెక్కిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
పోలీస్ ఫోర్స్ పేరుతో ఒక వెబ్ సిరీస్..
రోహిత్ శెట్టి ఇండియన్ పోలీస్ ఫోర్స్ పేరుతో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ లో సిద్ధార్థ్ మల్హోత్రా పోలీసు అధికారిగా కనిపించనున్నారు. రోహిత్ శెట్టి తరహా మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ గత కొన్నిరోజులుగా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సిరీస్ కోసం భారీ సెట్‌ను చిత్రబృందం రూపొందించారు. ప్రత్యేకంగా నిర్మించిన ఈ సెట్ కోసమే మేకర్స్ 20 కోట్ల ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగా కార్ చేజింగ్ లు, భారీ యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తుండగా రోహిత్ శెట్టికి ప్రమాదం జరిగినట్టు సమాచారం.
గతేడాది మే లో గోవాలో జరిగిన ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సందర్భంగానే సిద్ధార్థ్ మల్హోత్రాకు స్వల్ప గాయాలయ్యాయి. రోహిత్ శెట్టి, సిద్ధార్థ్ ఇద్దరూ వెబ్ సిరీస్ లో అరంగేట్రం చేస్తున్నారు. ఈ సిరీస్ లో వివేక్ ఒబెరాయ్, శిల్పా శెట్టి కీలక పాత్రల్లో నటించారు. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
ఇవీ చదవండి
Chain Snatching: రెండు గంటలు.. ఆరు స్పాట్లు.. హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న చైన్ స్నాచర్లు CCTV ఫుటేజ్ రిలీజ్
Chandrababu: టమాటోలు రెండు కిలోలు రూ.5 వేలు.. కుప్పంలో కొని పంచిన చంద్రబాబు
Waltair veerayya Trailer : సోషల్ మీడియాను ఊపేస్తున్న చిరంజీవి “వాల్తేరు వీరయ్య” మానియా..
Veera Simha Reddy: బాలకృష్ణ వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్ ఫొటోలు
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/