Site icon Prime9

Amitabh Bachchan: పాదరక్షలు విడిచి అభిమానులకు బిగ్ బి అమితాబ్ నమస్కారం.. నెట్టింట వైరల్

Big B Amitabh who left his shoes and saluted the fans

Bollywood: కీర్తింపబడడం ఓ అదృష్టం. ఆ ఆనందాన్ని నిలుపుకోవడం మరింత అదృష్టం. దాన్ని పాటించారు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్. తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు ధరించిన పాదరక్షలు వదిలి మరీ నమస్కరించడం అతని సంస్కారానికి కొలబద్దగా నిలిచింది.

అలాంటి ఘటన ఎందుకు చోటుచేసుకొనింది అనే క్రమంలో అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ ముంబై మారియట్ సమీపంలోని జంట అంతస్తుల బంగ్లాలో నివాసముంటున్నారు. ఆ ప్రాంగణాన్ని తన అభిమానుల కోసం ప్రత్యేకంగా జల్సా గా అమితాబ్ పేర్కొంటుంటారు. ప్రతి ఆదివారం తన అభిమానులను బచ్చన్ కలుసుకొంటూ వారితో సరదాగా గడుపుతారు. అయితే కరోనా కారణంగా జల్సా ప్రాంగణం వద్ద రెండు సంవత్సరాలుగా అభిమానులకు అనుమతి లేకపోవడంతో అమితాబ్ వారికి పూర్తిగా దూరమైనారు.

కరోనా నియంత్రణలోకి రావడంతో ఆదివారం అమితాబ్ బచ్చన్ తిరిగి జల్సా బంగ్లా వద్ద అభిమానులను కలుసుకొన్నారు. ఆ సమయంలో ఆయన తాను ధరించిన పాదరక్షలను విడిచి అభిమానులకు నమస్కారం చేశారు. ఇది నెట్టింట వైరల్ అయింది. అయితే దీని పై బచ్చన్ వివరణ ఇచ్చారు. అభిమానులను కలవడం అనేది నా దృష్టిలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం. ఫ్యాన్స్ అంటే నాకు భక్తి, అందుకే జల్సా లో అభిమానులను ఎప్పుడు కలిసినా చెప్పులు తీసేస్తుంటాను అంటూ బిగ్ బీ నెటిజన్లకు షాకిచ్చారు. సిని రంగానికి అమితాబ్ దూరమైన్నప్పటికీ పలు టివి షోలలో ఆయన పాపులర్ నటుడిగా ఇంకా కొనసాగుతున్నారు.

ఇది కూడా చదవండి: Pathaan teaser: హాలీవుడ్ సినిమాను తలదన్నెలా పటాన్ టీజర్

Exit mobile version