Prime9

Amitabh Bachchan: కౌన్ బనేగా కరోడ్ పతి సెట్స్ పై అమితాబ్ కాలికి గాయం

Bollywood: బిగ్ బి అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి సెట్స్ పై తన ఎడమకాలికి గాయమయిందని తన బ్లాగ్ పోస్ట్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. లోహపు ముక్క తన కాలిసిరను కోయడంతో రక్తస్రావం కావడంతో ఎడమ కాలికి గాయమైందని అమితాబ్ తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా కుట్లు పడ్డాయి. గాయం నయం అయ్యేంత వరకు నడవవద్దని, కదలవద్దని వైద్యపరంగా సూచించినట్లు అమితాబ్ వివరించారు

“కొన్ని అత్యుత్తమ ప్రదర్శనలు వేదికపైకి వెళ్లలేకపోవడానికి తగిన కారణాలుంటాయి అంటూ అమితాబ్ తన బ్లాగ్‌లో రాశారు. ట్రెడ్‌మిల్ నడక ద్వారా కూడా ఒత్తిడికి గురికావద్దని వైద్యులు సూచించారని అన్నారు. బిగ్ బి ఇటీవలే 80 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా అభిమానులు మరియు సినీ పరిశ్రమ సహోద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar